ఉద్యమాల పుట్టినిల్లుగా పేరున్న తెలంగాణ  మరో ఉద్యమానికి శ్రీకారం చుట్ట బోతుందా .. దీనికి సమాధానం అవుననే చెప్పాలి. తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల్లో  ఎక్కువ భాగం విముక్తి  కోసం జరిగిన పోరాటాలు. నాటి రైతాంగ పోరాటాలు మొదలు నిన్నటి రాష్ట్ర ఏర్పాటు వరకు ఇక్కడి ప్రజలు విరామం లేని పోరాటాలు చేశారు. అయినా మరోసారి పోరు బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం భౌతికంగా ఏర్పాటు అయినది కానీ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పాలించడంలో  ప్రభుత్వం విఫలమైందని, దీనికోసం ప్రజలంతా సన్నద్ధం కావడానికి, మరో పోరాటం చేయడానికి కారణమవుతోంది.

 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆరు దశాబ్దాల పాటు  తాము కోల్పోయినటువంటి  అనేక వస్తువులను తిరిగి పొందవచ్చని ప్రజల ఆశించారు  . 1969 ముందు, ఆ తర్వాత కూడా  రాష్ట్ర సాధన ఉద్యమ అనేకం జరిగినప్పటికీ, రాష్ట్ర సాధన మాత్రం 2002లోనే శ్రీకారం చుట్టుకుంది 14 సంవత్సరాలు ఏకధాటిగా జరిగిన ఉద్యమ ఫలితంగానే సాధ్యపడింది. ఈ యొక్క ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు నియామకాలు అన్న ట్యాగ్ లైన్ లోనే సాగింది. రాష్ట్రం ఏర్పడి  స్థానికులే ప్రభుత్వ అధికారం చేపట్టినప్పటికీ  ఆశించిన ఫలితాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉద్యమంలో భాగస్వాములైన యువకులకు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందనే భావన ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది.  దీనిపై ఆందోళన చేసిన వారిని  ప్రభుత్వం పోలీసులతో అణిచి వేస్తోందని, ఎదిరించి  నిలిచి అడిగిన వారి నోరు నొక్కుతున్న అంటూ ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు  నిత్యం ఏకరువు పెడుతున్నాయి.

ప్రశ్నించే గొంతుకలంటూ ఎక్కడ కనిపించకూడదు అన్నట్లుగా ప్రభుత్వం వారిని వివిధ కేసుల్లో ఇరికించాడమే కాకుండా ఏదో ఒక విధంగా నోరెత్తకుండా చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆనాటి ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయింది. వేల మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసుకున్నారు. తెలంగాణలో కనీసం వారిని గుర్తుకు తెచ్చుకునే పరిస్థితి కూడా లేకపోయింది. ఇలా పలు రకాల కారణాలతో  ప్రభుత్వం పాలన చేస్తోంది. ప్రస్తుత ఉద్యమంలో లేనివారు అధికారంలో ఉన్నారు. ఉద్యమంలో ఉన్న వారు  ఆగమై పోయారు. దీంతో విసుగు చెందిన ప్రజలు మరోమారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టాలని ఆలోచన వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: