హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్ ఒంటిరి అయిపోయాడా.? నిజానికి ప‌రిస్థితి చూస్తే అవున‌నే అనిపిస్తుంది. గ‌త కొద్దిరోజులుగా ఈట‌ల ఒక్క‌డే నియోజ‌క వ‌ర్గంలో ఒంట‌రి పోరాటం చేస్తున్నట్లు క‌నిపిస్తోంది. భూవివాదం అనంత‌రం పార్టీకి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈటల రాజేంద‌ర్ అనంత‌రం జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పార్టీ సీనియ‌ర్లు ఆయ‌న‌కు ఫేవ‌ర్‌గా లేర‌ని తెలుస్తోంది. అన్నీ తానై ఒంట‌రిగా పాద‌యాత్ర చేస్తున్నాడు ఈట‌ల‌.

   ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తు త‌న‌కే ఉంద‌ని ఈట‌ల చెప్పుకొస్తున్న‌, పార్టీ సీనియ‌ర్ల స‌పోర్ట్ లేద‌ని నిరాశ‌లొ ఈట‌ల ఉన్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో దుబ్బాక ఎన్నిక‌ల్లో బీజేపీ నేత‌లు అంద‌రు క‌లిసి స‌మిష్టిగా కృషి చేసి విజ‌యాన్ని పొందారు. కానీ హుజురాబాద్ దీనికి త‌ల‌కిందులుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ అర‌వింద్ దర్మ‌పురి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అడ‌పా ద‌డ‌పా ఈట‌ల గురించి మాట్లాడుతున్నారు.


కానీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పార్ల‌మెంట్ స‌మావేశాల నెపంతో ఈట‌లకు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి కూడా ఈట‌ల విష‌యంలో పెద్ద‌గా రియాక్ట్ కావ‌డం లేదు. జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత ముర‌ళీధ‌ర్ కూడా అంతంతే మాత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని తెలుస్తోంది. మొన్న‌టిదాకా త‌న‌కు స‌పోర్ట్ గా ఉంటాడ‌నుకున్న ఆ నియోజ‌క‌వ‌ర్గ నేత పెద్దిరెడ్డి టీఆర్ ఎస్ కండువా కప్పుకున్నాడు. దీంతో అడ‌క‌త్తెర‌లో పోక‌లా ఈట‌ల ప‌రిస్థితి ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

   నియోజ‌వ‌ర్గంలో టీఆర్ఎస్ సోష‌ల్ మీడియాలో  ఈట‌ల‌కు యాంటీగా చేస్తున్న ప్ర‌చారాల‌ను ఈట‌ల ఒక్క‌డే నిల‌బ‌డి ఎదుర్కొంటున్నాడు. అధికార పార్టీ గెల‌వాల‌ని ఎత్తుల మీద పై ఎత్తులు వేయ‌డానికి సిద్దం అయింది. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సామాన్య నేత నుంచి పెద్ద నేత వ‌ర‌కు చాలామ‌ణిలో ఉన్న ప‌లువురిని సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే ట‌చ్ చేశారు. ఇటు ప్ర‌భుత్వం ప‌రంగా ప‌లు ప‌థ‌కాలు అమలు చేస్తూనే పార్టీ ప‌రంగా కూడా వ్యూహాలు ప‌న్నుతున్నాడు గులాబీ బాస్ సీఎం కేసీఆర్‌. ప్ర‌చారం మొద‌లు కాక ముందే నియోజ‌కవ‌ర్గంలో మంత్రుల‌ను దించ‌డానికి టీఆర్ ఎస్ అధిష్టానం ప్లాన్ వేసిన‌ట్టుగా తెలుస్తోంది.

  నియోజ‌కవ‌ర్గంలోని బీజేపీలో వ‌ర్గ‌పోరు కొన‌సాగుతోంది. ఇదే క్ర‌మంలో ఈట‌ల గెలిచినా ప్ర‌తిప‌క్షంలో ఉండాల్సిందేన‌ని అలా ఉంటే నియోజ‌వ‌ర్గాన్ని ఏం అభివృద్ది చేస్తాడు అని బ‌య‌ట ప్ర‌చారం కూడా ఉంది. అయినా ఈట‌ల మాత్రం తానే గెలుస్తాన‌ని, ప్ర‌జ‌ల దీవెన‌లు ఉన్నాయ‌ని విశ్వాసంతో ఉన్నాడు. ఈట‌ల హిట్ అవుతాడ లేదా అనే విష‌యం ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: