కేరళ..దేశంలోనే అత్యధిక వైద్య సదుపాయాలు పటిష్టం గల రాష్ట్రం. మెరుగైన సదుపాయాలు, అధ్బుతమైన పాలన. కానీ కరోనాకి మాత్రం ఇవేమీ పట్టడంలేదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకమైన మెరుగైన వైద్య రంగాన్ని సవాలు చేస్తూ దాడి చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయినట్టే అనిపిస్తోంది అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న కేసులు, వాటి వ్యాప్తి తీవ్రతే ఇలా అంచనాకి వచ్చేలా చేస్తోంది. నిన్న మొన్నటి వరకు సెకండ్ వేవ్ ఎలాగో తగ్గిపోయింది ఇక థర్డ్ వేవ్  రాకపోతేనే బాగుంటుంది. రాకూడదు కూడా అని కోరుకున్న దేశ ప్రజలకి ఇది నిజంగా పిడుగు లాంటి వార్తే. ప్రస్తుతం కేరళ లో ఈ వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా పాకుతోంది. పాజిటివ్ రేటు అలా పెరిగిపోతూనే ఉంది. అంతే కాకుండా మరణాల శాతం కూడా పెరుగుతోంది. 

థర్డ్ వేవ్ ఉదృతి పై ఒక అంచనా ఉన్నప్పటికీ ఇప్పుడే దాన్ని నిర్ధారించి చెప్పలేము అంటున్నారు శాస్త్రవేత్తలు. దేశంలో ఈ కరోనా మూడవ దశ ఇంకెంత అల్లకల్లోలం సృష్టిస్తుందో   అని అందరూ కలవరపడుతున్నారు. ఇక కేరళలో ప్రస్తుతం కోవిడ్ గణాంకాలు చూడగా ....కేరళలో  నిన్న గడిచిన 24 గంటల్లో మొత్తం 1,52,639 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో భారీ మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదు అవడం అందరినీ కలవరపెడుతోంది. ఏకంగా ఇందులో పాజిటివ్ శాతం 13.61 శాతానికి పెరగడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 1,60, 824 యాక్టివ్ కేసులు ఉండగా ....27,833 మంది కరోనా బాధితులు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. 

మొత్తం 14,651 మంది కరోనా పీడితులు ఈ వైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కేరళ రాష్ట్రంలో  ఇప్పటి వరకు టోటల్ గా చూస్తే 33,70,137 మంది ప్రజలు కరోనా బారిన పడగా.. అందులో ఈ వైరస్ దాటికి 16,701 మంది మరణించారు. రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఎలా విజృంభించనుందో అని దేశమంతా ఇపుడు ఆందోళన మొదలయ్యింది. దీని నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏప్పటి కప్పుడు సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: