తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సంక్షేమ రాజ్యం తేవాలని వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల  సంకల్పంతో ఉన్నారు. అనుకున్నట్టుగానే  ఆమె తెలంగాణలో  తన పార్టీని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అప్పటి నుంచి దీక్షలు, పాదయాత్రల పేరుతో ముందు కదులుతున్నది. కానీ షర్మిల అక్కకు  ఆదిలోనే  చుక్కెదురయింది అని చెప్పవచ్చు. పార్టీ కనీసం మారుమూల గ్రామాలకు చేరకముందే  పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆధిపత్య పోరుతో  బయటకు పోతున్నారు. తాజాగా వైయస్సార్ టీపీకి చెందిన చేవెళ్ల ప్రతాపరెడ్డి గుడ్ బై చెప్పాడు. వెంటనే  ఆ పార్టీ నేత  రాఘవరెడ్డి వ్యవహార శైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

రాజీనామా పత్రాన్ని  పార్టీ కార్యాలయానికి ప్రతాప్ రెడ్డి పంపాడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వైయస్సార్ టిపి ఇన్చార్జిగా ప్రతాప్రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల అక్క కసరత్తు ప్రారంభించిందని చెప్పవచ్చు. అన్ని జిల్లాలను  ఆమె చుట్టి వేయాలని ప్లాన్ కూడా వేసుకున్నారు. సీఎం కేసీఆర్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను  ఎప్పటికప్పుడు  తప్పు పడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే  ప్రతాప్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం  కలకలం రేపుతోంది. తను రాజీనామా చేయడానికి  రాఘవరెడ్డి కారణమని ఆయన చెబుతున్నారు.

దీన్ని బట్టి చూస్తే  పార్టీ ప్రారంభంలోనే ఆధిపత్య పోరు ఇంతలా ఉంటే, పార్టీ తెలంగాణలో  ఎప్పుడు పుంజు కుంటుంది. ఎలా పుంజుకుంటుంది. ఇప్పటికే షర్మిల పార్టీ అంటే  ఆంధ్రకి సంబంధించిన పార్టీల, ఆమెను చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు  ఆమె అభిమానిస్తారన్న నమ్మకం అయితే  లేదన్నట్టు కనబడుతోంది. తన తండ్రి వైఎస్సార్  పేరు చెప్పుకొని, ఆయన అభిమానుల్లో చోటు సంపాదించు కోవాలని, ఆయన బిడ్డగా నేను వస్తున్నానని ఆమె పదేపదే చెబుతూ పార్టీని  పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే  రాబోవు రోజుల్లో పార్టీ తెలంగాణలో పుంజుకోవడం ఎలా అనే అనుమానాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: