వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈయనకు నందికొట్కూరు నియోజకవర్గంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అందుకే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా ఉన్న నందికొట్కూరుకు సిద్ధార్థ్ సమన్వయకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

సమన్వయకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో వైసీపీ తరుపున నిలబడిన ఆర్థర్‌ భారీ మెజారిటీతో గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో బైరెడ్డి హవా కొనసాగుతుందనే సంగతి తెలిసిందే. ఇలా బైరెడ్డి హవా ఉన్న నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వడ్ కాకముందు అంటే 2009 ఎన్నికల ముందు, ఇక్కడ టీడీపీ హవానే ఉండేది.

బైరెడ్డి పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ తరుపున పలుమార్లు నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2009లో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా అయ్యాక ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ మంచి మెజారిటీలతో విజయం సాధించింది. అయితే ఇక్కడ ముందు నుంచి బైరెడ్డి ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే బైరెడ్డి రాజశేఖర్‌తో విభేదించి సిద్ధార్థ్ వైసీపీలో సత్తా చాటుతున్నారు.

ఇలా తన ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్‌ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అందుకే ఇక్కడ వైసీపీకి మంచి విజయాలు దక్కుతున్నాయి. భవిష్యత్‌లో కూడా వైసీపీకి తిరుగు ఉండదని తెలుస్తోంది. అభ్యర్ధి ఎవరైనా సరే ఇక్కడ వైసీపీకే విజయం దక్కేలా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీని కాపాడేనాథుడే కనబడటం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఓడిపోయిన బండి జయరాజు ఇప్పుడు అడ్రెస్ లేరు. మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరుపున ఎవరు నిలబడతారు? అనేది క్లారిటీ లేదు. ఇక ఎవరు నిలబడిన ఇక్కడ టీడీపీకి గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: