వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ట్వీట్‌ చేశారు నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయని.. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి జగన్ రెడ్డి బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చురకలు అంటించారు నారా లోకేష్. 

 గిరిపుత్రుల గుండెల పై గునపం దింపిన జగన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గర్లో ఉందని హెచ్చరించారు నారా లోకేష్.  బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ అండ్ కో తో పాటు మన్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కి సహకరించిన అధికారులు కూడా ఈ సారి చిప్పకూడు తినడం ఖాయమని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మైనింగ్ మాఫియా చేస్తోన్న అరాచకాలు, దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటపెట్టి అక్రమార్కులతో ఊచలు లెక్కపెట్టిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు నారా లోకేష్. 

ఇక అంతకు ముందు నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌ లో... సామాన్యుల పరిస్థితి దారుణంగా ఉందని.. చట్టాన్ని ఏపీ పోలీసులు చుట్టంగా చేసుకున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లి కనుసన్నల్లోనూ పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుందుని మండిపడ్డారు  నారా లోకేష్‌. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని... అన్యాయాలకు పాల్పడినప్పటికీ... న్యాయస్థానం ముందు మాత్రం దోషులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కానీ దీనికి మాత్రం కాస్త సమయం పడుతుందని... శిక్ష మాత్రం తప్పదని పేర్కొన్నారు నారా లోకేష్.  ఎన్ని దౌర్జన్యాలు చేసినా.. చట్టం ముందు దోషులుగా మిగిలిపోతారని.. నారా లోకేష్ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలకు కూడా జగన్‌ సర్కార్‌ కు బుద్ది చెప్పే టైం దగ్గరపడిందన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: