కొన్ని దశాబ్దాల కింద ఆప్ఘనిస్థాన్లో తాలిబలు న్ సృష్టించిన అరాచకాల గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. అక్కడి ప్రభుత్వాలను శాసిస్తూ, ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తూ తాలిబన్లు రాక్షస పాలన కొనసాగించారనే చెప్పాలి. ఇక ఆ తర్వాత అమెరికా అండతో అటు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆధిపత్యం తగ్గిస్తూ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం మరో సారి తాలిబన్లు రెచ్చి పోతున్నారు .. ఏకంగా ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తూ మళ్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లోనే  సైనిక స్థావరాలను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు.



కాగా ప్రపంచ అగ్ర రాజ్యంగా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా మరో సారి ఆఫ్ఘనిస్తాన్ కోసం ముందుకు వచ్చింది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అరాచకం సృష్టిస్తున్న తాలిబన్లను హత మార్చేందుకు అమెరికా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేస్తుంది. ఇప్పటికే ఆప్ఘనిస్థాన్లో తాలిబన్లు 90% సరిహద్దు దేశాల రహదారులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం, కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం లాంటివి చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల  నైట్ కర్ఫ్యూ విధించింది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం.



 ఇక రాత్రి సమయం లో ఆయుధ దాడులు, ఎయిర్ ఫోర్స్ దాడులతో తాలిబన్ల పై విరుచుకు పడుతుంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం.  ఇక ఇటీవల అమెరికా అండతో మరింత విజృంభిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధి లోనే రెండు వందల వరకు తాలిబన్లను హత మార్చింది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. తాలిబన్ల స్థావరాలను అమెరికా సాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఐడెంటిఫై  చేసి ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సమాచారం అందిస్తుంది.  ఈ సమాచారం అందుకో గానే ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్, ఆయుధాల తో విరుచుకుపడుతూ తాలిబన్లను పట్టుబడుతోంది.  ఇలా ఆయుధ సాయుధ తోడ్పాటుని అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ అందిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: