ప్రస్తుతం చైనా నుంచి పాకిపోయి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది కరోనా.  ప్రపంచ దేశాలు మొత్తం  వైరస్ భయం గుప్పిట్లో నుంచి బయటపడలేక పోతున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఒక రకం కరోనా వైరస్ తగ్గింది అనుకునేలోపే మరొక రకం కరోనా వైరస్ విజృంభిస్తుంది. అదే సమయంలో ప్రపంచ దేశాలలో మునుపెన్నడూ లేనంతగా అల్లకల్లోలం సృష్టిస్తోంది.  ఇక మొన్నటివరకు సెకండ్ వేవ్ తో ప్రపంచ దేశాలు మొత్తం అల్లాడి పోయాయి.


 అన్ని దేశాలలో కూడా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే క్రమక్రమంగా కఠిన ఆంక్షలు మధ్య కరోనా వైరస్ ప్రభావం తగ్గుతు వచ్చింది. అదే సమయంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే మొదట్లో కేవలం ఒక డోసు వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అందరూ భావించారు. కానీ ఆ తర్వాత సెకండ్ వేవ్ కరోనా వైరస్ రావడంతో ఇక వైరస్ ను ఎదుర్కోవడానికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తప్పనిసరి అని అన్నారు   ఈ క్రమంలోనే కొన్ని దేశాలు ఇప్పటికే ఇక 2-దశల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశాయి.



 దీంతో మాస్కు తప్పని సరి కాదు అంటూ పలు సడలింపు కూడా ఇచ్చారు. కానీ కరోనా వైరస్ మళ్లీ విస్తరించడం మొదలు పెట్టింది  దీంతో మాస్క్ తప్పనిసరి కాదు అని చెప్పిన ఆయా దేశాల ప్రభుత్వాలు మళ్ళీ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అనే కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అంతే కాదు కొత్తగా వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్లు కరోనా వ్యాక్సిన్ కే సవాల్ విసురుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అటు ఇజ్రాయెల్లో కూడా  కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ మూడవ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మూడవ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి అంటూ ఇటీవల ప్రకటన చేసింది ఇజ్రాయిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: