రేపు ఎల్లుండి లాల్ ద‌ర్వాజ భోనాల నేప‌థ్యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప‌లు ఆంక్ష‌లు విధించారు. ఫలక్ నుమా, ఇంజన్ బౌలి నుండి వచ్చే వాహ‌నాలు అలియాబాద్ నుండి షంషీర్ గంజ్ గోశాల తార్బన్ మీదుగా వెళ్ళాలని సూచించారు. కందికల్ గేట్ బాలరాజ్ గంజ్ మంచి లాల్ దర్వాజ రూట్ లో ట్రాఫిక్ ను అనుమతించరని తెలిపారు. ఓల్డ్ చత్రినాక మీదుగా గొలిపురా వైపు వాహ‌నాల‌ను మళ్లిస్తారన్నారు. ఉప్పుగూడ నుండి ఛత్రినాక వైపు నుండి వచ్చే వాహ‌నాల‌ను గౌలిపురా క్రాస్ రోడ్స్ నుండి మొగలురా పీఎస్ వైపు మళ్లిస్తారని తెలిపారు. మీరా కా దయార మొఘలురా నుండి హరిబౌలి క్రాస్ కు వచ్చే ట్రాఫిక్ ను వాటర్ ట్యాంక్ ఏరియా మీదుగా డైవర్ట్ చేస్తారని చెప్పారు. చార్మినార్ మెయిన్ రోడ్, అస్రా హాస్పిటల్ నుండి వచ్చే ట్రాఫిక్ ను మొఘల్ పురా వాటర్ ట్యాంక్ మీదుగా బీబీ బజార్ వైపు మళ్లిస్తారని తెలిపారు. లాల్ దర్వాజ టెంపుల్ ఊరేగింపు జరిగే 19 ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్ లు ఉంటాయన్నారు.

చార్మినార్ ఫలక్ సుమా, నయాపూల్ నుండి ఓల్డ్ సీబీఎస్, అఫ్టల్ గంజ్, దారుసలాం క్రాస్ రోడ్స్ మీదుగా ఆర్టీసీ బస్సులను అనుమతించర‌ని వెల్ల‌డించారు. ఆర్టీసీ బస్సుల దారి సైతం మళ్లిస్తార‌ని తెలిపారు. ఉప్పల్ నుండి అంబర్ పేట్ మీదుగా ట్రావెల్ చేసే సిటీ బస్సులను హబ్సిగూడ, తార్నాక, అడిక్ మెట్ విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, నింబోలి అడ్డా చాదర్ ఘాట్ మీదగా సీబీఎస్ వైపున‌కు మళ్లిస్తారని చెప్పారు. ఉప్పల్ నుండి అంబర్ పేట్ వైపు వచ్చే సిటీ బస్సులను గాంధీ విగ్రహం వద్ద సీపీవెల్ సల్లావా గేట్, టి- జంక్షన్, రోడ్ నం 6, అలీకేష్ మీదగా మళ్లిస్తున్న‌ట్టు తెలిపారు. నింబోలి అడ్లా మీదగా దిల్ సుఖ్ న‌గ‌ర్, శివం రోడ్ నుండి అంబర్ పేట వైపు వచ్చే బస్సులను అలీకేఫ్, జిందా తిలిస్మాత్ రోడ్, తిలక్ మీదగా మళ్లిస్తారని చెప్పారు.

నింబోలి అడ్డా నుండి అంబర్ పేట‌ వైపు వచ్చే బస్సులను టూరిస్ట్ హోటల్స్, ఫీవర్ హాస్పిటల్, ఓయూ పై ఓవర్, తార్నాక మీదుగా మళ్లిస్తామ‌ని చెప్పారు. అంతే కాకుండా వాహ‌నాల‌ను పార్కింగ్ చేసే స్థ‌లాల‌ను కూడా వెల్ల‌డించారు. అలియాబాద్ వైపు నుండి వచ్చే వెహికిల్స్ ను పోస్టాఫీస్ కు ఎదురుగా, శాలిబండ వద్ద సింగిల్ లైన్, అల్కా థియేటర్ బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయాల‌ని చెప్పారు. హరిబౌలి నుండి వచ్చే వాహనాలను ఆర్యా మైదాన్, సుధా థియేటర్ లైన్, అల్క థియేటర్ ఓపెన్ ప్లేస్ లో పార్క్ చేయాలన్నారు. ఛత్రినాక ఓల్డ్ పీఎస్ వైపు నుండి వచ్చే వాహనాలను వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, లక్ష్మీనగర్, సరస్వతి విద్యానికేతన్ - ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఫలక్ నుమా పత్తర్ కు దర్గా సమీపంలో పార్క్ చేయాలన్నారు. అంతే కాకుండా మూసాబౌలి, మీర్ చౌక్ వైపు నుండి వచ్చే వాహనాలను చార్మినార్ బస్ టర్మినల్ వ‌ద్ద పార్కు చేయాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: