ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వచ్చిన ఈ రెండున్నరేళ్లు పాలన ఎలా ఉందని సగటు మానవుడిని అడిగితే వారు చెప్పే సమాధానం ఒక్కటే 'రాజన్న రాజకీయ వారసుడిగా ప్రజల్లోకి వచ్చి, ప్రజల బాధలు తెలుసుకుని, వారి ఆశీసులతో సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టోలో తాను చెప్పిన ప్రతి ఒక్క హామీని, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆర్ధికంగా రాష్ట్రము వెనుకబడుతున్నా లెక్క చేయక ఏదో ఒక విధంగా అమలు చేస్తూ ముందు కెలుతున్నాడు' అని సంతోషంగా చెబుతాడు. అయితే ఇదంతా కూడా గ్రామాలలో ఉండే ప్రజల్లో భావన. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు జగన్ కి గుండెల్లో ఏకంగా గుడి కట్టారు. అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే పట్టణ మరియు నగరాల పాలనకు వచ్చే సరికి, ఇక్కడ సీన్ అంతా మారిపోతుంది. పట్టణ ప్రాంతాలలో ప్రజలను సంతృప్తి పరచాలంటే వారికి కావాల్సిన ఉద్యోగాలు, పరిశ్రమల స్థాపన, నగరీకరణ వంటి చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

అప్పుడే వారు సంతృప్తి పడతారు. పాలన బాగుందని జై జగన్ అని అంటారు. కానీ ఇప్పుడు కొన్ని పట్టణాల్లో జగన్ పై ప్రేమతో ఎవ్వరూ ఈ విషయాన్ని హైలైట్ చేయడం లేదు. కానీ, కొన్ని నగరాల్లో అయితే ప్రజలు కంటికి కనబడని శత్రువుతో యుద్ధం చేస్తున్నారని చెప్పాలి. జగన్ మీద ఎంతో అభిమానంతో ప్రేమతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో సాధారణ నాయకులను సైతం ఎమ్మెల్యేలను చేశారు. కానీ వారు ప్రజల సేవను మరిచిపోయి... పెద్ద పెద్ద పదవులు వచ్చాక ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారిలో సింహపురి నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే మరియు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి పధంలో నడిపించకుండా వారి నాయకుల కనుసన్నల్లోనే నెల్లూరి రాజకీయ నడుస్తోందని టీడీపీ నాయకులు విమర్శిస్తున్న మాట తెలిసిందే. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా అయ్యాక నెల్లూరుకు రావడం అరుదుగా మారిందని సొంత పార్టీలోనే లుకలుకలున్నట్లు తెలుస్తోంది.

గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో తన టీడీపీ ప్రత్యర్థి నారాయణను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈ సారి మాత్రం నెల్లూరు పట్టణంలో వైసీపీ గెలవకపోవచ్చని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. దీనికి కారణం నెల్లూరు పట్టణ అభివృద్ధిపై అనిల్ కుమార్ యాదవ్ చూపించిన నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. అంతే కాకుండా త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో అనిల్ కు ఉద్వాసన పలకొచ్చనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. కనీసం మిగిలిన రెండున్నర సంవత్సరాలైనా సొంత పార్టీలోని నేతలతో సానుకూలంగా వ్యవహరించి, నగర అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయని, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే అవడం పక్కా అని తెలుస్తోంది. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: