ప్రపంచంలో విజయాలను నమోదు చేసిన వ్యక్తుల పేరునే కాదు వారు వాడి పడేసిన వస్తువులను కూడా వేలంలో భారీ ధర పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇప్పటికీ మనం ఎంతో మంది గొప్ప వ్యక్తుల వస్తువులను వేలం వేయడం భారీ సంఖ్యలో జనాలు పాల్గొనడం ఆ వస్తువులకు వేలంలో దిమ్మతిరిగిపోయే ధర పలకడం చూస్తూనే ఉంటాం. ఈ సారి మరీ భిన్నంగా ప్రపంచంలో విజయాలకు చిరునామా అయిన యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ దరఖాస్తును కూడా వేలానికి ఉంచారు. హా... ఉంచినంత మాత్రాన దరఖాస్తును ఎవరు కొంటారు లే అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఈ దరఖాస్తుకు దిమ్మతిరిగిపోయే ధర పలికింది. వేలంలో ఆ దరఖాస్తుకు దాదాపు 3.43 లక్షల డాలర్లు పలికింది. ఈ సొమ్మును మన భారత కరెన్సీలోకి మారిస్తే ఏకంగా 2.5 కోట్లు పలికిందన్న మాట. అంత ధరనా అని తెలిసిన ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు. వేలంలో ఒక చిన్న కాగితం ముక్కకు మరీ అంత ధర చెల్లించాలా అని ముక్కున వేలేసుకుంటున్నారు.


అసలు స్టీవ్ జాబ్స్ జాబ్ చేశాడా అనే అనుమానం చాలా మందిలో కలగక మానదు. అంత పెద్ద యాపిల్ కంపెనీ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ కు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏం పట్టిందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన యాపిల్ కంపెనీ స్థాపించక ముందు కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగం కోసమే జాబ్స్ చేసుకున్న దరఖాస్తును ప్రస్తుతం వేలం వేయగా కళ్లు చెదిరే ధర పలికింది. ఈ అప్లికేషన్ ను స్టీవ్ జాబ్స్ 1973లో పెట్టుకున్నారు. కాగా స్టీవ్ జాబ్స్ స్నేహితులు ఈ దరఖాస్తును వెబ్ పేజ్ రూపంలో మార్చి వేలం వేశారు. ఇప్పటికే ఈ దరఖాస్తును మూడు సార్లు వేలం వేయగా... మూడో సారి రికార్డు ధర పలుకుతూ అమ్ముడుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: