టిడిపి అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు మాట్లాడుతూ.... దేవినేని ఉమ పై కేసులు పెట్ట‌డం... దారుణం దుర్మార్గం ..చాలా‌నీచమైన పని అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ నేతలే దాడులు చేసి రివర్స్ కేసులు పెట్టారంటూ చంద్రాబాబు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. జరిగిన సంఘటన అంతా చూస్తున్నారని... కొండపల్లి బొమ్మలు తయారు చేసే చోట చెట్లను నరికేస్తున్నారంటూ చంద్రాబాబు ఆవేద‌న వ్యక్తం చేశారు. ఎన్విరాన్ మెంట్ దెబ్బతింటుందని ఉమా తో పాటు టీడీపీ నేతలు అక్కడికి వేళ్లారని చంద్రాబాబు వెల్ల‌డించారు. ఉమా పైన హ‌త్యాయ‌త్నం కేసు పెట్ట‌డానికి ప్రభుత్వానికి అస‌లు సిగ్గుందా అంటూ చంద్రాబాబు ప్ర‌శ్నించారు.

సీనియర్ పోలీస్ అధికారి డిజిపి కూడా ఇలా చేయడం అన్యాయం...ఎంతోమంది డీజీపీలు నా వ‌ద్ద‌ పనిచేశారు..కానీ ఇలా ఎప్పుడు చేయ‌లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవినీతి జరుగుతుందని త‌మ‌ నేతలు అక్కడికి వెళితే ఇంత నీచంగా నిక్రుష్టంగా వ్యవహరిస్తారా..? అంటూ ప్ర‌శ్నించారు. నిజ నిర్ధారణ కమిటీ వేస్తే అక్కడ కరోనా ఉందనే సాకు చెప్పి పంపరా.? అని ప్ర‌శ్నించారు.  దేవినేని ఉమా ఏం తప్పు చేశాడు... ఎనిమిది గంటల వ‌ర‌కూ కారులోనే ఉన్నాడని అన్నారు. దేవినేని ఉమా ప్రాణాలు కాపాడమని  డిజిపి కి తాను లేఖ రాస్తాన‌ని చెప్పారు. దేవినేని ఉమా రూటు మార్చింది పోలీసులు కాదా అంటూ చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో గూండాలు.... రౌడీల రాజ్యం నడుస్తుందని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టిడిపి నేతలు దాడులు చేస్తే భయపడాలా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశామ‌ని చంద్రాబాబు అన్నారు.

అందరూ కూడా కాలగర్భంలో క‌లిసిపోయారంటూ వ్యాక్యానించారు. వైసిపి నేతలు రాళ్లు వేస్తే పారిపోతామా ..మరో పది మంది పుట్టుకు వ‌స్తారంటూ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఏం చేయలేదని...రెండేళ్ల నుండి వారిపై దాడులు విపరీతంగా పెరిగాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అభివృద్ధి లేదు..సంక్షేమం..హక్కులు లేవు..ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను నిర్వీర్యం చేస్తున్నారంటూ మండి ప‌డ్డారు. రాజకియ లబ్ధి కోసమం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ని వాడుకుంటున్నారు కానీ వాళ్లకు ఉపయోగపడడం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం నాశనం అయింద‌ని... ఇటువంటి వ్యక్తి వచ్చినప్పుడే అంతా నాశనమైందని చంద్రాబాబు ఆగ్రహానికి గుర‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: