కొన్ని సార్లు ప్ల‌స్ అవుతుంద‌నుకున్న‌దే మైన‌స్ కావొచ్చు.. మైన‌స్ అనుకున్నది మ‌నకు అనూకూలంగా మారొచ్చు. అలాంటి ప‌రిస్థితే సారు కారు స‌ర్కారుకు రాబోతుందా అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఇటీవ‌ల ద‌ళిత‌బంధు ప‌థ‌కం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్క‌డ చూసినా ద‌ళిత బంధుపైనే ఫోక‌స్ ఉంది. 

హుజురాబాద్ ఎన్నిక‌ల వేళ సీఎం కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాడు. దీని ద్వారా ఒక్కో ద‌ళిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు పంపిణీకి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉప‌ ఎన్నిక‌లు ఉన్న హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే దీన్ని పైల‌ట్ ప్రాజెక్ట్ అమ‌లు చేయ‌బోతున్నారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ దీన్ని రాజ‌కీయం కోసం ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

 అయితే ఈ పథకం ద్వారా చాలావరకు టీఆర్ఎస్‌కు లబ్ది చేకూర‌నున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓట్లు కూడా బాగానే ప‌డుతాయ‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో దీని వ‌ల్ల టీఆర్ ఎస్ కు న‌ష్టం క‌లుగుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున్న వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

   కేవ‌లం ఉప ఎన్నిక ఉంద‌నే హుజూరాబాద్‌కు వేల కోట్లు పెట్టి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాని ఓట్ల కోసం ఇవ‌న్ని చేస్తున్నార‌ని కొంద‌రు అంటున్నారు.  కానీ రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలని పట్టించుకోవడం లేదని ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు. ఇక తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయని, అప్పుడు వేల కోట్లు తమకు కూడా ఇస్తారని త‌మ ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

  ఈ విధంగా ఎన్నిక‌లు ఉన్న చోటే కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ కు నెగెటివ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. కేవ‌లం ఓట్ల కోసం వేల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని, ద‌ళిత బంధు పెట్టిన త‌మ‌కు కూడా ఇత‌ర ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఇత‌ర కులాల వారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే త‌మ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ద‌ళిత బంధును ప్రారంభించాల‌ని ప‌లువురు అంటున్నారు.

   హుజురాబాద్ త‌రువాత ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్తో ద‌ళిత బంధు అమలు కాకుంటే మిగిలిన ఆ సామాజిక వ‌ర్గం వారు ఊరుకునే ప‌రిస్థితి క‌న‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే ఈ ప‌థ‌కం ద్వారా త‌క్కువ డ‌బ్బులు కాకుండా ఒక్కో కుటుంబానికి ప‌ది ల‌క్ష‌లు ఇవ్వ‌డ‌మే. మిగిలిన కులాల‌కు కూడా ఈ విధ‌మైన ప‌థ‌కాలు పొందాల‌ని ఆశ క‌లుగుతుంది. ఇప్పుడు బాగానే ఉన్న త‌రువాత త‌రువాత ఇది టీఆర్ ఎస్ కు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. గ‌తంలో కేసీఆర్ ద‌ళితుల‌కు మూడెక‌రాలు పంచుతామ‌ని చెప్పి ఇప్ప‌టికీ ఆ ఊసే ఎత్త‌డం లేద‌ని ప్ర‌తి ప‌క్షాలు దాన్ని ఆయుధంగా ఉప‌యోగిస్తున్న‌ట్టే, భ‌విష్య‌త్తులో ద‌ళిత బంధు కూడా అయ్యేలా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs