కరోనా మహమ్మారి వచ్చిన దగ్గరి నుంచి జనాలకు కంటి నిండా కునుకు లేదు... కడుపు నిండా తిండి లేదు. కరోనా తో చాలా మంది జనాలు తిండి నిద్రలకు అలమటిస్తున్నారు. కరోనా పీడ తొలిగిపోయే రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మహమ్మారి మాత్రం ఇప్పట్లో వదిలేలా కనిపిండం లేదు. తన రూపాలను మార్చుకుంటూ శాస్త్రవేత్తలకు కొత్త కొత్త సవాళ్లను విసురుతోంది. జనాలు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా సరే వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇన్నాళ్లు భారత్ ను అతలాకుతలం చేసిన సెకండ్ వేవ్ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చల్లబడ్డాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మరలా కేసుల సంఖ్య పెరుగుతుంది. థర్డ్ వేవ్ ముందే రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం వైద్యులు ఎంత హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల వారికే కాక వారి కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు కూడా మహమ్మారి సోకే ప్రమాదం ఉంది.


కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని ప్రదేశాల్లో వ్యాక్సిన్ల కోసం జనాలు ఎగబడుతూ.. భయానక పరిస్థితులను కల్పిస్తున్నారు. ఎంతలా వ్యాక్సిన్ వేసినా కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వ్యాక్సినేషన్ సరళి ఇంకా అందజేయాల్సిన వారి గురించి కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. భారతదేశంలో ఉన్న బిచ్చగాళ్లతో పాటు నిరుపేదలకు కూడా వ్యాక్సిన్ వేయాలని సూచించారు. అంతే కాకుండా అనాథలు, రిహాబ్ క్యాంపుల్లో ఉండేవారికి కూడా వెంటనే కోవిడ్ టీకాలు వేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన సీఎస్ లకు సూచించారు. ఇలా అందరికీ వ్యాక్సిన్ వేయడం వల్లే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ నుంచి మనం త్వరగా బయట పడే చాన్స్ ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: