ఢిల్లీ : చీడ పురుగులు, విష పురుగులు  సీఎం  జగన్ దగ్గరకు చేరాయని.. మా సిఎం  దగ్గర ఉన్న చీడ పురుగులకు  అదనంగా మరో చీడ పురుగు చేరిందని నర్సాపురం ఎంపీ  రఘురామ కృష్జరాజు అన్నారు.  దేవినేని ఉమ అరెస్టు, రాజమండ్రీ జైలు కు తరలింపు అక్కడి సూపర్ డెంట్ ను మార్చడం అనుమానాలకు దారితీస్తోందని.. ఒక మంచి ఉద్దేశం ఉన్న  ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండి పడ్డారు.  కారు లో ఉన్న వ్యక్తి  దాడులు ఎలా చేస్తారని.. సెక్షన్  307 కింద కేసు పెట్టాలి అంటే స్పాట్ లోనే  మారణ ఆయుదాలు, గాయం అయి ఉండాలన్నారు రఘురామ కృష్జరాజు.  

ఎలాంటి మారణ ఆయుదాలు లేకుండానే ఒక్క రక్తపు మారక లేనప్పుడు సెక్షన్  307 కింద కేసు ఎలా పెట్టారని మండిపడ్డారు.  కేసు పెట్టి,  జైలుకు తరలించి అక్కడి సూపర్ డెంట్ ను ఏందుకు ఆకస్మాత్తుగా మార్చారని.. చెప్పారు. ఉమ ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆయన రూమ్ లో సిసి కెమేరాలు ఏర్పాటు చేసి దాని లింక్ ను మేజిస్ట్రేట్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘురామ కృష్జరాజు.  రాజమండ్రి లోని మానవ హక్కుల నాయకులు కాని అక్కడి ప్రముఖులు ఎవనైనా ప్రతి రోజు ఉమ రూమ్ ను సందర్శించేలా చూడాలని ఆయన కోరారు. 

 చట్టాలు, సెక్షన్లు ను దుర్వినియోగం చేసి రాజకీయ ఒత్తిడులతో అన్యాయం గా కేసులు పెడితే అలాంటి పోలీసు అధికారులు పై న్యాయ స్థానాలు ఆశ్రయించి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయమని సోమవారం సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పారు. రాష్టంలో కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి బకాయిలు కూడా రావడం లేదని మండిపడ్డారు.  ఎన్ని అక్రమాలు చేసిన ప్రజలు వారికి బుద్ది చెబుతారని హెచ్చరించారు రఘురామ కృష్జరాజు. 


మరింత సమాచారం తెలుసుకోండి: