గుంటూరు : తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పరిశీలనకు వెళ్తున్న టిడిపి నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. మైనింగ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన నాయకులను ఎనిమిది మందిని అరెస్టు చేశారని.. తేదేపా పార్టీ ఆఫీస్ కి వెళుతుండగా దౌర్జన్యంగా అరెస్టు చేసి మంగళగిరి నుంచి కొలిపార తీసుకు రావడంలో అర్థం ఏంటి.? అని ప్రశ్నించారు.

  మైనింగ్ లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముందని.. తప్పు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా అక్రమ అరెస్టులు చేసి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారని నిప్పులు చెరిగారు.  అక్రమ మైనింగ్ జరిగిందని ఒప్పుకుంటే తెదేపా నాయకులు తమ కమిటీని వెనక్కి తీసుకుంటారన్నారు.  అందులో లోటు పాట్లు ఉంటే సరి చేసు కోవాలని సూచనలు చేశారు.  ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతిపక్షంలో ఉండి నిజాలను వెలికితీస్తే వైసీపీకి ఎందుకు కోపమని మండిపడ్డారు.  

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం, మైనింగ్ విధానాలలో జగన్ జేబులు నింపుతున్నాయని ఆరోపణలు చేశారు. మద్యం విక్రయిస్తే జే టాక్స్ రూపంలో వాళ్ళ జేబులు నింపుతున్నాయని.. కొండల నుంచి గుట్టల వరకు అక్రమ తవ్వకాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.  జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం అనే విధానాన్ని పాటిస్తున్నారని మండిపడ్డారు.  ఈ విధానం మంచి పద్ధతి కాదు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.  రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగే అక్రమ మైనింగ్ పై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు వంగలపూడి అనిత. ఒక మంచి ఉద్దేశం ఉన్న  ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని  వైసీపీ నేతలు  దుర్వినియోగం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కారు లో ఉన్న వ్యక్తి దాడులు ఎలా చేస్తారన్నారు. ఎలాంటి మారణ ఆయుదాలు లేకుండా ఒక్క రక్తపు మారక లేనప్పుడు సెక్షన్ 307 కింద ఎలా కేసు పెట్టారని మండిపడ్డారు వంగలపూడి అనిత.




మరింత సమాచారం తెలుసుకోండి: