మొత్తానికి మోడీకి ఎదురు నిలిచే నాయకురాలిగా మమత అవతరించారు. ఆమె ఎలాంటి అదురు బెదురు లేకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ మమతకు కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. అందుకే ఆమె మిగిలిన వారి మాదిరిగా ముసుగులో ఉండకుండా సులువుగా బయటపడిపోగలిగారు అంటున్నారు.

మమత మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. ఆమె డేరింగ్ లేడీ. పోరాడితే వదిలిపెట్టే రకం కాదు. ఇక బెంగాల్ లో ఆమె రాజకీయం సుస్థిరం అయినట్లుగా తాజాగా జరిగిన బెంగాల్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. వచ్చే ఎన్నికల్లో లోక్ సభ సీట్లు కూడా పెద్ద ఎత్తున ఆమె పార్టీకి దక్కుతాయి అన్న అంచనాలు ఉన్నాయి. ఇక ముందు లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాతనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. దాంతో ఒక విధంగా మమత చాలా ఫ్రీ అయిపోయారు. అయిదేళ్ళ పాటు బెంగాల్ లో అధికారం ఉంచుకుని ఆమె ఇపుడు దేశం మీద పడ్డారు.

మమత మోజు అంతా ప్రధాని కుర్చీ మీదనే ఉంది. ఆమె ముందు వచ్చారు కాబట్టి ప్రయారిటీ ప్రకారం చూస్తే ఆ చాన్స్ ఆమెకే ఉండవచ్చు అని కూడా చెప్పాలి. ఇక పెద్ద రాష్ట్రానికి నాయకురాలు కావడం, మోడీ అంటే పొడగిట్టని నైజం ఇవన్నీ కూడా ఆమెకు ప్లస్ పాయింట్లు. అయితే ఆమె దూకుడే మైనస్ అయ్యే అవకాశం ఉంది. మమత ప్రధాని అంటే ముందు వామపక్షాలు అంగీకరిస్తాయా అన్నది కూడా చూడాలి. ఇక ప్రాంతీయ పార్టీల నేతలు అంతా తామే పెద్ద కుర్చీ ఎక్కాలని చూస్తున్నారు. వారు మమతను కోరి తెచ్చిపెట్టి మరీ అందలం ఎక్కిస్తారా అన్నది డౌట్. ఇక మమత మొండితనం కూడా అందరికీ తెలిసిందే. అయితే మమత ఇపుడు విపక్షాలను కలిపే పనిలో ఉన్నారు. ఆమె చేత ఈ పనులు అన్నీ చేయించి చివరి ఆఖరుకు తాను ఎంట్రీ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది అన్న మాట కూడా ఉంది. మొత్తానికి మమత తాపత్రయం తీరేనా. ఆమె కుర్చీ ఆశ ఫలించేలా అంటే వెయిట్ అండ్ సీ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: