క్వాలిటీ చెక్ : జ‌ర నేర్చుకోండ్రి దిద్దుకోండ్రి

నేనే అంతా అనుకోవ‌ద్దు
ఈ దేశం గ‌ర్వించే స్థాయి మీది కాదు

ఈ రెండూ గుర్తించుకోండి
మ‌న భ‌ర‌త జాతి బిడ్డ‌ల  విజ‌యాల‌ను
స్మ‌రించ‌క మీరేం చేస్తున్నారు
అని బీజేపీ పెద్ద‌లు కోపం అయ్యారు
తెలంగాణ నేత‌ల‌పై...

సొంత‌లాభం కొంత మానుకోండి
ఇదీ గుర‌జాడ మాట
ఇదే మాట బీజేపీ పెద్ద‌లు చెప్పారు
సొంత ప్ర‌చారం మానుకుని పార్టీ కోసం
ప‌నిచేయ‌మ‌ని అప్పుడే పార్టీకీ
పార్టీని న‌మ్ముకున్న నాయ‌కుల‌కూ
భ‌విష్యత్ ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ఇంకా హై క‌మాండ్ ఏమ‌న్న‌దంటే...
యువ‌త‌ను దూరం పెట్టొద్ద‌న్న‌ది
అన్ని మతాల కులాల
స‌ఖ్య‌త‌తో మ‌ద్ద‌తుతో
కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌మ‌ని చెప్పి
నాలుగు మాట‌లు  హెచ్చ‌రిక‌ల
రూపంలో తీవ్ర స్వ‌రంతో చెప్పింది
 
తెలంగాణ బీజేపీకీ, బండి సంజ‌య్ కూ ఒకేసారి క్లాస్ తీసుకుంది బీజేపీ హై క‌మాండ్.. పార్టీలో  యువ‌త ఉందా లేదా అని ఆరా తీ సింది. హుజురాబాద్ లో ప‌నిచేసిన విధంగా అన్ని ని యోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌నిచేయ‌మ‌ని చెప్పింది. ఇంకా ఒకింత అస‌హ‌నానికి లో న‌యింది. పార్టీలో వివిధ అనుబంధ విభాగాలున్నా అవి ప‌ని చేసే తీరు బాలేద‌ని స్ప‌ష్టం చేసింది. దేశం గ ర్వించే స్థాయిలో ప్ర‌పం చం నివ్వెర పోయిన స్థాయిలో మ‌న క్రీడాకారిణులు రాణిస్తుంటే క‌నీసం వారి పేరిట పార్టీ కార్యాల‌యాల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం విచార‌క‌రం అని పేర్కొంటూ నాయ‌కుల బాధ్య‌తారాహిత్యంపై మండిపడింది. ఇప్పుడీ మాట‌లు నేనే అంతా అను కునే నాయ‌కులు ఎలా ప‌ట్టించుకుంటారో లేదో అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. గ‌త కొద్ది కాలంగా బీజేపీ తెలంగాణ విభాగంలో నెల‌కొన్న అంతఃక‌ల‌హాల‌పై కూడా అధిష్టానం దృష్టి సారించింద‌న్న విష‌యం స్ప‌ష్టం అవుతోంది. కానీ ఎప్ప‌టిలానే కొట్లాట‌లు ఉండ‌డంతో పార్టీ ప‌నితీరుపై పూర్తి డేటాను ఎనాలైజ్ చేసి, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అదే స్థాయిలో అదే తీవ్ర‌త‌తో చెప్పి పార్టీ నాయ‌కుల‌ను ప‌ద్ధ‌తిగా ప‌నిచేయ‌మ‌ని హిత‌వు ప‌లికింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: