రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించిన‌ప్ప‌టికీ.. అత్యంత కీల‌క‌మైన‌.. ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎంతో కుతూహ‌లంగా ఎదురు చూస్తున్న గుంటూరు ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌రిగినా ఫ‌లితం మాత్రం రాలేదు. ఇప్ప‌ట్లో వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీ స‌ర్కారు కానీ.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కానీ.. ఈ విష‌యంలో జొక్యం చేసుకోవ‌డం లేద‌ని అంటున్నారు రాజకీయ ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఏంట‌నేది అంతుబ‌ట్ట‌డం లేద‌ని చెబుతున్నారు. గుంటూరు ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యంలో ఇటు ప్ర‌భుత్వం, అటు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అనుస‌రిస్తున్న విదానంపై విమ‌ర్శ‌లు మాత్రం వ‌స్తున్నాయి.

గుంటూరు ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. నిబంధ‌న‌ల ప్ర‌కారం నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా.. ఈ ఎన్నిక‌ల‌ను హైకోర్టు నిలుప‌పుద‌ల చేసింది. దీంతో దీనిపై ప్ర‌భుత్వం హైకోర్టులో రివ్యూ పిటిష‌న్ వేసినా.. ఈ కేసుపై విచార‌ణ మాత్రం ఇంకా జ‌ర‌గ‌లేదు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆధ్వ‌ర్యంలోనే ఈ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చారు. అయితే.. ఆయ‌న హ‌యాంలోనే ప‌రిష‌త్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. కేవ‌లం ఇది త‌ప్ప‌.. అన్న‌ట్టుగా ఆయ‌న కార్పొరేష‌న్ ఎన్నిక‌లు.. పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించి త‌ప్పుకొన్నారు. త‌ర్వాత‌.. ఈయ‌న స్థానంలో వ‌చ్చిన మాజీ సీఎస్‌..  నీలం సాహ్ని.. ప‌రిష‌త్ పోరును నిర్వ‌హించారు.

ఈ క్ర‌మంలోనే గుంటూరు ప‌రిష‌త్‌కు కూడా నోటిఫికేష‌న్ ఇచ్చారు. అయితే.. దీనిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌హా.. జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు.. కోర్టుకు వెళ్లాయి. ఏక‌గ్రీవాల‌ను ర‌ద్దు చేసి.. మొత్తం ఎన్నిక‌ల ప్రక్రియ‌ను తిరిగి నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశాయి. అయితే..ఏక‌గ్రీవాల‌ను ర‌ద్దు చేసే అధికారం కోర్టుకు లేద‌న్న న్యాయ‌మూర్తి.. ప్ర‌క్రియ‌ను కొన‌సాగించ వ‌చ్చ‌ని.. అయితే.. ఫ‌లితాలు మాత్రం విడుద‌ల చేయొద్ద‌ని అన్నారు. దీంతో గుంటూరు ప‌రిష‌త్‌కు ఎన్నిక‌లు జ‌రిగినా.. ఫలితాలు మాత్రం విడుద‌ల కాలేదు. ఇప్పుడు ఏలూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. టీడీపీపై ఏర్ప‌డిన శూన్య‌త‌ను త‌గ్గించుకునేందుకు గుంటూరు ప‌రిష‌త్ ఫ‌లితాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని.. టీడీపీ భావిస్తోంది.

ఇక్క‌డ త‌మ‌కు అనుకూల ప‌వ‌నాలు ఉన్నాయ‌ని.. రాజ‌ధాని ప్‌్భావం ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై ఉంటుందని.. టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌రిష‌త్ ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌ను ప్ర‌క‌టించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ.. మ‌ళ్లీ హైకోర్టును ఆశ్ర‌యించే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు నిర్వ‌హించినా.. నిలిచిపోయిన ఫ‌లితం వెల్ల‌డైతే..తమ‌కు ఒకింత మేలు జ‌రుగుతుంద‌ని.. టీడీపీ భావిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: