తూర్పు గోదావరి...ఏపీలో ఎక్కువ నియోజకవర్గాల ఉన్న జిల్లా...ఈ జిల్లాలో వచ్చే ఫలితాలు బట్టే పైన రాష్ట్రంలో ఏ పార్టీ అయిన అధికారంలోకి రాగలుగుతుంది. అంటే తూర్పులో మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీకి బాగా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ప్రధాన పార్టీలు ఎక్కువగా తూర్పుపైనే ఫోకస్ చేసి రాజకీయం చేస్తుంటారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుని, రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది.

అయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈ జిల్లాలో సత్తా చాటాలని అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది. అటు వైసీపీకి చెక్ పెట్టి తూర్పులో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టీడీపీ చూస్తోంది. ఇక ఇప్పుడున్న పరిస్తితుల్లో తూర్పులో వైసీపీదే లీడింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని స్థానాల్లో టీడీపీకి కూడా పుంజుకునే అవకాశం దక్కినట్లు కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉంటే, 14 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉండగా, 4 స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక స్థానంలో జనసేన గెలవగా, ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీకే సపోర్ట్ ఇస్తున్నారు.

అయితే టీడీపీ గెలిచిన నాలుగు స్థానాల్లోనూ ఇప్పుడు ఆ పార్టీనే బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక వైసీపీ గెలిచిన 14 స్థానాల్లో కొన్నిటిలో లీడింగ్ మారినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల మీద ఉండే వ్యతిరేకిత, కొందరు టీడీపీ నేతలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో, వైసీపీ గెలిచిన కొన్ని స్థానాల్లో టీడీపీకి అనుకూల పరిస్తితులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి.  

ఇక ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ జిల్లాలో జనసేన కూడా కాస్త బలంగానే ఉంది. ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిస్తే మాత్రం జిల్లాలో వైసీపీ బలం ఖచ్చితంగా తగ్గడం ఖాయమని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే, జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: