ఏపీలో ఎన్నో అంచనాల మధ్య రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఏది కలిసి రావడం లేదనే సంగతి తెలిసిందే. మొదటలో జనసేన పార్టీ పోటీ చేయకపోయినా, ఆ పార్టీ మద్ధతుతో టీడీపీ-బీజేపీలు అధికారంలోకి రాగలిగాయి. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. సరే ఇలా ఓటమి పాలయ్యాక జనసేన ఏమన్నా పుంజుకునే పరిస్తితి ఉందా? అంటే అసలు పుంజుకున్నట్లు కనిపించడం లేదు.

ఇంకో ఒకటి, రెండు ఎన్నికలు జరిగిన జనసేన పరిస్తితి ఇలాగే ఉండేలా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ సైతం పార్టీ బలోపేతం మీద పెద్దగా దృష్టి పెట్టకపోగా, ఆ పార్టీ నాయకులు కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో జనసేనకు క్షేత్ర స్థాయిలో బలం రావడం లేదు. మామూలుగా టీడీపీ, వైసీపీలకు క్షేత్ర స్థాయి నుంచి బలంగా ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి ఆ పార్టీలకు క్యాడర్ ఉంది. కానీ అలాంటి క్యాడర్‌ని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు.

అందుకే ఆ పార్టీకి ఇంకా బలం పెరగడం లేదు. ముఖ్యంగా రాయలసీమలో పవన్ కల్యాణ్‌కు కొంచెం కూడా బలం ఉన్నట్లు కనిపించడం లేదు. మామూలుగా పవన్, రాయలసీమ జిల్లాల పర్యటనకు వెళితే పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు వస్తారు గానీ, వారు జనసేనకు మాత్రం ఓటు వేయరని తెలుస్తోంది. అందుకే గత ఎన్నికల్లో జనసేనకు రాయలసీమ జిల్లాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు.

ఏదో కోస్తా జిల్లాల వరకు బాగానే ఓట్లు తెచ్చుకున్న జనసేన, రాయలసీమలో మరీ ఘోరంగా విఫలమైంది. సీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో జనసేనకు ఓట్లు చాలా తక్కువగా పడ్డాయి. ఈ జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు పది వేల ఓట్లు వస్తే గొప్పే అని మాదిరిగా పరిస్తితి ఉంది. ఇక భవిష్యత్‌లో కూడా సీమలో పవన్ కల్యాణ్‌కు ఏ మాత్రం ఛాన్స్ లేదని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: