ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ యుద్ధం సహజంగానే జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం రాజకీయం కాస్త వ్యక్తిగతమైపోతుంది. పార్టీలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుంటాయి. అయితే ఇందులో అధికార పార్టీలదే పైచేయిగా ఉంటుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలనీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా నేతలని ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పొచ్చు.

మరి అన్ని ఇబ్బందులు పడినప్పుడు అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లోనే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే అక్కడ నుంచి టీడీపీని కోలుకొనివ్వకుండా వైసీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అసలు చంద్రబాబు ఏ మాత్రం పుంజుకోకుండా జగన్ ట్రాప్ చేస్తున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు. అది ఎలా అంటే...వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు ఏదొకరకంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అయితే బలమైన టీడీపీ నేతలని టార్గెట్ చేసుకుని వైసీపీ అదిరిపోయే దెబ్బ కొడుతున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. అందులో భాగంగానే పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు కావడం అని తెలుస్తోంది. ఆ కేసుల్లో నిజం ఎంత ఉందనే విషయాన్ని పక్కనబెడితే, వరుస పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు జైలు పాలవ్వతున్నారు.

ఇక జైలుకెళ్లిన నేతలు, కార్యకర్తలని ఓదార్చడమే చంద్రబాబు, నారా లోకేష్‌ల పని అయిపోయింది. పైగా కరోనా నేపథ్యంలో అధినేత చంద్రబాబు పెద్దగా ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు లేవు. ఒకవేళ వస్తే నాయకులని పరామర్శించడానికే బాబుకు సమయం సరిపోతుంది. మరి ఇంకా పార్టీని ఎలా బలోపేతం చేసుకుంటారు...నెక్స్ట్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులని ఎలా సిద్ధం చేసుకుంటారనే అంశాలు పక్కకువెళ్లిపోతున్నాయి. ఏదేమైనా జగన్ ట్రాప్‌లో బాబు బాగానే చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: