టీడీపీ నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే అందరూ చేసే విమర్శలు వేరు.. మంత్రి పేర్నినాని సెటైర్లు వేరు.. ఆయన రొటీన్ రొడ్డకొట్టుడు విమర్శల్లా కాకుండా.. కాస్త సెటైరిక్‌గా విమర్శలు చేస్తుంటారు. తాజాగా దేవినేని ఉమ అరెస్టుపై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. దేవినేని ఉమాపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్నచంద్రబాబుకు ఆయనపై ఎందుకు కేసు పెట్టారో తెలియదా అంటూ నిలదీశారు. అసలు ఇలా మాట్లాడుతున్న చంద్రబాబుకు ఆవగింజంతైనా సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నారు.


ఇంట్లో పడుకుంటేనో.. లేక.. బాబు వెన‌క సంచులు మోస్తుంటేనో  దేవినేని ఉమా కేసులు పెట్టలేదని పేర్ని అంటున్నారు. దళితులపై దాడి చేసి, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, అలజడి సృష్టించినందుకే  దేవినేని ఉమపై కేసు పెట్టారని పేర్ని నాని అన్నారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు, దేవినేని ఉమాలు కొండలను పిండి చేసి తినేశారో.. శాటిలైట్‌ గూగుల్ మ్యాప్‌లే చెబుతున్నాయంటున్నారాయన. దేవినేని, చంద్రబాబు ఇవాళ డ్రామాలకు తెరలేపి రాజకీయాలు చేద్దామంటే ఎవరూ ఊరుకోరని పేర్ని నాని తేల్చి చెప్పారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఏం చేశాడని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు.. అధికారంలోకి రాగానే గ్ర‌వ‌ర్ణాల‌కు సీట్లు.. ఇదే చంద్రబాబు సిద్ధాంత‌మ‌ా అని పేర్ని నాని ప్రశ్నించారు. తన అయిదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా చంద్రబాబుకు మనసు రాలేదని పేర్ని నాని అన్నారు.


ప్రతి రాజ్యసభ స్థానాన్ని చంద్రబాబు అగ్రవర్ణ కులాలతో నింపారని... ఎన్నికలప్పుడు మాత్రం సీటు ఇస్తామంటూ తన అనుకూల పేపర్లలో రాయిస్తారని... చివరకు వారికి మొండిచేయి చూపిస్తారని అన్నారు. ఓట్లు అడుక్కునేటప్పుడు మాత్రమే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపిస్తారని.. గతంలో కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా  సెంట్రల్‌ క్యాబినెట్‌తో పాటు రాజ్యసభలోనూ వారికి అవకాశం కల్పించలేదని పేర్ని నాని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: