భారత్ లో ట్రిపుల్ తలాఖ్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చిన నాటి నుంచి... ఈ తరహా కేసులు భారీగా తగ్గుతున్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆగస్ట్ 1న అనగా నేడు ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ట్రిపుల్ తలాఖ్ కు వ్యతిరేకంగా చట్టం చేయడం ద్వారా ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని మోడీ ప్రభుత్వం కాపాడిందని నఖ్వీ తెలిపారు.


భర్తకు తన భార్యతో సంబంధం తెంచుకోవాలనుకున్నప్పుడు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పడం ద్వారా డైవోర్స్ పొందే వీలుంటుంది. తలాక్ ను నోటితో చెప్పొచ్చు.. చేతి రాత ద్వారా కూడా చెప్పొచ్చు. ఈ విషయంపై ముస్లిం మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు అత్యున్నత ధర్మాసనానికి అనేక పిటిషన్లు కూడా క్యూకట్టాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సుప్రీం కోర్టు తలాక్ తలాక్ తలాక్ అనేది రాజ్యాంగానికి విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. ఆగస్ట్ 17న ఆ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

అంతకుముందు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం తలాక్ ను నేరంగా పరిగణించింది. అందుకోసం ఓ బిల్లును రూపొందించి లోక్ సభకు తీసుకొచ్చింది. డిసెంబర్ 27.. 2018సంవత్సరంలో అందుుక ఆమోదం కూడా ప్రకటించింది. తలాక్ ద్వారా ఏ ఒక్క ముస్లిం మహిళకు అన్యాయం జరుగకూడదనే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఒకవేళ నిబంధనలు అతిక్రమించిన భర్తకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. దీంతో ముస్లిం మహిళల జీవితాలు నిలబడతాయని కేంద్ర ప్రభుత్వం భావించింది.

అయితే ఇప్పటికే పాకిస్థాన్, ఇరాన్, శ్రీలంక, ఖతార్, ఇరాక్, బంగ్లాదేశ్, మలేషియా, జోర్డాన్ లాంటి దేశాలు ఇప్పటికే తలాక్ ను నిషేధించాయి. ఆ దేశాల సరసన భారత్ కూడా స్థానం సంపాదించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: