హుజురాబాద్ మొత్తం రాజకీయ సమీకరణాలు  మారుతూ వస్తున్నాయి. మొదట్లో ఎంతో దూకుడుగా  ప్రచారం చేసినటువంటి పార్టీలు కాస్త నేమ్మదించాయి. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎన్నికలేప్పుడో కూడా తెలియదు. బిజెపి పార్టీ నుంచి మాత్రం  ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారం కొనసాగించారు. పాదయాత్ర పేరుతో ప్రచారం మొదలు పెట్టి  చివరికి అనారోగ్యంతో  ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన మోకాలు ఆపరేషన్ కావడంతో, పూర్తిగా పాదయాత్రకు బ్రేక్ వస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో పాడి కౌశిక్ రెడ్డి  బరిలో ఉంటారని అనుకున్నారు.

 కానీ అనూహ్యంగా  కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరి  కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ విధంగా  ఇటు తెరాస పరిస్థితి చూసుకుంటే మాత్రం కెసిఆర్ కి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే  కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి  పార్టీలో చేరిన పది రోజుల్లోనే  ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై హుజురాబాద్ నియోజకవర్గం అంతా  తెరాస సీనియర్ నేత అయిన టువంటి ఒక నాయకుని ఇంట్లో రాష్ట్ర సమావేశం నిర్వహించారని, ఈ సమావేశంలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్తగా వచ్చిన లీడర్ కి  ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన మా నియోజకవర్గం వస్తే  మేమే కుర్చీలు వేయాల్సి వస్తుందని సీనియర్లకు కనీసం విలువ ఇవ్వని నాయకులకు ఎమ్మెల్సీ ఇస్తే పరిస్థితి ఏంటని వారి మధ్య చర్చ సాగినట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై నియోజకవర్గ టీఆర్ఎస్ కు మంచి జరుగుతుందో, లేదా చెడు జరుగుతుందో తెలియక కార్యకర్తలంతా అయోమయంలో ఉన్నారు.

హుజురాబాద్ ఎన్నికలను ఒక సవాలుగా తీసుకున్నటువంటి తెరాస ప్రభుత్వం ఇప్పుడు కార్యకర్తల అసహనంతో ఎన్నికల్లో ఎన్ని మార్పులకు దారితీస్తుందో మనం చూడాలి. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బండ శ్రీనివాస్ కి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వడంతో దళిత ఓట్లకు ఆకర్షించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి  కలిసి వచ్చేనా లేదంటే తెరాస పార్టీ కొంప ముంచుతుందా అనీ కార్యకర్తలంతా అనుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా చేసినటువంటి సంబరాల్లో కేవలం తెరాస పార్టీలో ఆయనతో పాటు చేరిన అనుచరులే పాల్గొనడం అనుమానాలకు దారితీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: