మ‌హారాష్ట్ర‌లో పూణేకు చెందిన ఓ పాప బ‌త‌కాలంటే రు. 16 కోట్ల విలువైన ఇంజెక్ష‌న్ చేస్తే కాని బ‌త‌క‌ద‌ని.. ఆమెను బ‌తికించుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు సాయం చేయాల‌ని సోష‌ల్ మీడియాలో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు వెలిశాయి. జ‌న్యుప‌ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతోన్న ఆ పాప‌కు వెన్నుముక‌, కండ‌రాల క్షీణిత ఏర్ప‌డింది. ఆ పాప‌ను బ‌తికించుకునేందుకు ఆమె త‌ల్లిదండ్రుల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది స్వ‌చ్ఛంద సంస్థ‌ల వాళ్లు త‌మ‌కు తోచిన‌ట్టుగా విరాళాలు సేక‌రించారు. ఎట్ట‌కేల‌కు రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ చేసినా కూడా ఆ పాప బ‌త‌క‌లేదు.

అంత ఖ‌రీదైన ఇంజెక్ష‌న్ చేసినా కూడా యేడాది వ‌య‌స్సు ఉన్న పాప సౌరబ్ షిండే మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. ఆమెను బ‌తికించేందుకు పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో ఆ పాప కొద్ది సేప‌టి క్రిత‌మే చ‌నిపోయింది. కొన్ని కోట్ల మంది పాప‌ను బ‌తికించుకునేందుకు చేసిన సాయం వ్య‌ర్థం కావ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చాక ఆమె ఆరోగ్యం మెరుగు అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.


రెండు రోజుల క్రితం పాప‌కు శ్వాస‌కోస స‌మ‌స్య రావ‌డంతో వెంట‌నే ఆమెకు వెంటిలేట‌ర్ అమ‌ర్చారు. అయినా పాప బ‌త‌క‌లేదు. గ‌త నెల‌లో ఇంజెక్ష‌న్ చేసిన త‌ర్వాత పాప శ‌రీరం స్పందించ‌డంతో పాటు ఆమెలో క‌ద‌లిక‌లు కూడా వ‌చ్చాయి. గ‌త నెల‌లో ఆమె పుట్టిన‌రోజు కూడా వైభ‌వంగా చేసుకుంది ఆ పాప కుటుంబం. అయితే రెండు రోజుల క్రితం ఉన్న‌ట్టు ఉండి ఆరోగ్యం క్షీణించ‌డంతో పాటు ఆమె చ‌నిపోయింది.

దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది పాప‌ను బ‌తికించేందుకు చేసిన దాన‌ల‌కు ఆ పాప కుటుంబం క‌న్నీళ్ల‌తో కృత‌జ్ఞ‌త‌లు చెపుతోంది. రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ చేసిన త‌ర్వాత మూడు నెల‌ల పాటు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ముందే చెప్పారు. అయితే ఇంత‌లోనే జ‌ర‌గ‌రాని ఘోరం జ‌రిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: