క‌రోనా మూడో వేవ్ ఉదృతి స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు త‌మ ప్ర‌జ‌ల‌కు కొవిడ్ వ్యాక్సినేష‌న్ ఇవ్వాల‌ని నిపుణులు చూచిస్తున్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 40 కోట్ల మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్ అందించారు. ఇది కేవ‌లం దేశ జ‌నాభాలో 30 శాతం కంటే త‌క్కువే. కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు టీకాల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ముందున్నాయి. అయితే గ‌తంలో టీకాల కొర‌త ఉండ‌డంతో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నెమ్మ‌దిగా కొన‌సాగింది. కొన్ని సంద‌ర్భంలో టీకాల కొర‌త‌తో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ నిలిచిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది కూడా.

  కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఐసీఎంఆర్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఎప్ప‌టిక‌ప్ప‌డు సూచ‌న‌లు చేస్తూనే ఉంది. ప్ర‌స్తుతం దేశంలోని ప్ర‌జ‌ల‌కు కొవాక్సిన్‌, కోవిషీల్డ్ టీకాల‌ను పంపిణీ చేస్తున్నారు. కొన్ని రోజుల త‌రువాత చుక్క‌ల మందు టీకాను భార‌త్ బ‌యోటిక్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈ చుక్క‌ల మందు టీకాను ముక్కులో వేస్తార‌ని ఆ సంస్థ తెలిపింది. ఈ చుక్క‌ల మందు టీకా ద్వారా సుల‌భంగా తొంద‌ర‌గా వ్యాక్సినేష‌న్‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌వ‌చ్చు.

  ఈ నేప‌థ్యంలో ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కార్ ఒకే రోజు భారీగా టీకాలు వేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ రోజు అంటే ఆగస్టు 3 న  వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు నెలకొల్పాలని యూపీ ప్ర‌భుత్వం సంకల్పించింది. ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా జరగని రీతిలో ఒక్కరోజులో అత్యధిక జనాభాకు టీకా వేసేందుకు సన్నాహాలు చేసింది యోగి గ‌వ‌ర్న‌మెంట్‌.  ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ 4 కోట్ల 87 లక్షల మందికి కోవిడ్ టీకాలు పంపిణీ చేశారు. అయితే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మెగా డ్రైవ్ వ్యాక్సినేషన్ చేప‌ట్టి యూపీలోని 20 లక్షల జనాభాకు వ్యాక్సిన్ వేసేందుకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికపే రెడీ చేసింది.



  క‌రోనా మూడో ఉదృతి రాక‌ముందే వీలైనంత ఎక్కువ జ‌నాభాకు కొవిడ్ టీకాల‌ను అందించాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భావించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన రాష్ట్రంగా యూపి నిలిచింది. అయితే ఒక్క రోజులో 12 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయ‌డం సుల‌భం అని, అయితే ఒక్క రోజే 20 ల‌క్ష‌ల మందికి టీకా వేయ‌డం క‌ష్టం తో కూడుకుంది అని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి జ‌య‌ప్ర‌తాప్ సింగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: