ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు పూర్తయింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తన కేబినెట్లోకి తీసుకున్న మంత్రులతో మీరంతా రెండున్నర సంవత్సరాలు మాత్రమే మంత్రి పదవుల్లో ఉంటారని... ఆ తర్వాత 90 % మంది మంత్రులను మార్చే వారి స్థానంలో కొత్త మంత్రులను తీసుకుంటా అని ప్రకటించారు. వాస్తవంగా చూస్తే వైసీపీ క్యాబినెట్ లో చోటు దక్కని వారు చ‌కోర ప‌క్షుల్లా` ఎదురు చూస్తున్నారు. రెండున్నర సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతాయా ? అని రోజులు లెక్కపెట్టుకుంటూ ఉన్నారు. మరో మూడు నెలల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండున్నర సంవత్సరాలు పూర్తవుతుంది. ఇక ఇప్పటికే జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వస్తున్నారు.

దీంతో ఇప్పుడు వైసీపీలో ఈ రెండేళ్లలో ఎప్పుడూ లేనంత జోష్‌ కనిపిస్తోంది. దసరా కు ముందు ఆ తర్వాత జగన్ తన కేబినెట్‌ను ప్రక్షాళన చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో క్యాబినెట్ లో ఎవరు ? ఉంటారు.. ఎవరు ? బయటకు వెళ్తారు అన్న దానిపై చర్చలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. ఇక పలువురు ఆశావాహులు మరో మూడు నెలల్లో తాము మంత్రులం అయిపోతామని ఉత్సాహంతో ఉన్నారట. ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న మంత్రులు మాత్రం క‌రోనా కార‌ణంగా రెండు సంవత్సరాలు తాము మంత్రులుగా చేసిందేమీ లేదని.. కేవలం నామమాత్రంగానే క్యాబినెట్లో కొనసాగామ‌ని మరో ఏడాది పాటు తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం వద్ద విన్న‌వించుకున్నట్టు తెలుస్తోంది.

అయితే జగన్ సైతం వారి బాధను అర్థం చేసుకున్నా... వారు చెప్పినట్టు మరో ఏడాది పాటు వారి మంత్రి పదవులు కొనసాగిస్తానని స్పష్టమైన హామీ అయితే ఇవ్వలేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. జగన్ మాత్రం కొత్తగా క్యాబినెట్లోకి సమర్థులైన నాయకులను తీసుకుని వారి ఆధ్వర్యంలోనే 2024 ఎన్నికల కి వెళ్ళి బంపర్ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఏదేమైనా దసరా వేళ ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు అయితే రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: