టాలీవుడ్ సీనియర్ నటులలో జయప్రద క్రియేట్ చేసిన సంచలనాలు ఏ హీరోయిన్ కు సాధ్యం కాదనే చెప్పాలి. 1980వ దశకంలో అఖిలాంధ్ర సినీ ప్రేక్షకుల అందాల దేవత గా ఉన్న జయప్రద ఆ తరం హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆ పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 1994 లో ఎన్టీఆర్ ఏపీలో మూడోసారి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఏడాదికే చంద్రబాబు ఎన్టీఆర్ ను బలవంతంగా గద్దె దింపి ఆయన పదవిలోకి వచ్చారు. ఈ సమయంలో జయప్రద , చంద్రబాబుకు ఎన్టీఆర్ నుంచి అధికారం బదలాయింపు జరిగేందుకు ఎంతో సాయం చేశారు.

చంద్రబాబుకు తాను చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఆయన జయప్రదను ఒకసారి రాజ్యసభకు పంపించారు. ఆరేళ్లపాటు జయప్రద ఢిల్లీలో ఎంపీ హోదాలో అధికారం అనుభవించారు. అయితే ఆ తర్వాత ఆమె చంద్రబాబు తో విభేదించి తెలుగుదేశం కు గుడ్ బై చెప్పేశారు. దీనికి ప్రధాన కారణం జ‌య‌ప్ర‌ద‌ను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసేందుకు చంద్రబాబు ఒప్పుకోలేదు. ఈ విషయం పై అలిగిన ఆమె తెలుగుదేశం పార్టీని వీడ‌డంతో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె పార్టీ నుంచి త‌ప్పుకుని.. తెలుగు మహిళ అధ్యక్ష పదవి కూడా వ‌దులుకున్నారు.

ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆమె బాబు అంటే కోపంతోనే ఉన్నారు. అయితే ఆమె ఢిల్లీలో ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి సమాజ్ వాదీ పార్టీ అధినేత అమ‌ర్‌సింగ్‌తో ఏర్పడిన సాన్నిహిత్యం నేపథ్యంలో ఆమె యుపి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రాంపూర్ నుంచి రెండు సార్లు ఎస్పీ త‌ర‌పున‌ ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు ఆమె బిజెపిలో చేరి నుంచి అజాంఘ‌డ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: