కరోనా వైరస్ భారత్ లో ఎంత అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వైరస్ కారణంగా ఇక అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయిపోయాయ్. సంపన్నుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు చివరికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు ఉపాధి దొరక్క మరోవైపు కుటుంబ పోషణ భారమై ఇక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.  ఇలా భారత్ లో కరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను దుర్భరం గా మార్చింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే పేద మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అమలులోకి తెచ్చింది. ఇదిలా ఉంటే కేవలం భారత్లోనే కాదు అగ్రరాజ్యమైన అమెరికా లో కూడా ఇలాంటి దుస్థితి ఎదురైంది అన్న విషయం తెలుస్తుంది. మొన్నటివరకు కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఎంతోమంది పేదలను ఆదుకోవడానికి అక్కడి ప్రభుత్వం అత్యధికంగా ప్యాకేజీలు ఇచ్చింది అని అక్కడి మీడియా ఎంతగానో భజన చేసింది.  కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది అని అర్థమవుతుంది. ఇటీవలే అమెరికా లో ఏర్పడిన ఒక సంక్షోభం గురించి బయట పడింది.



 ఏకంగా అమెరికాలో 35 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులుగా మారబోతున్నారు అనే విషయం ఇటీవల తెరమీదికి వచ్చింది. 11 నెలలుగా కరోనా కష్టకాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక.. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి  హోమ్ లోన్స్ కూడా కట్టలేని దుస్థితిలో ఉండిపోయారట. తద్వారా బ్యాంకులో ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్న వారి ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారట.  ఇలా ఉపాధి అవకాశాలు లేక ఇళ్లని కోల్పోతున్న వారు ఏకంగా వందల్లో వేలల్లోనే కాదు లక్షల్లో కూడా ఉన్నారట. ఏకంగా 35 లక్షల మందికి పైగా ఇలా నిరాశ్రయులు కాబోతున్నట్లు తెలుస్తోంది.  అగ్రరాజ్యమైన అమెరికా లోని పరిస్థితి ఇలా ఉంటే ఇక చిన్న చితక దేశాలలో పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉందో అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: