ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివృద్ది లేదు, ఏమీ లేదు అంతా అయిపోయింది అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఇది నిజ‌మే అన్న‌ట్టు క‌నిపిస్తుంది ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరు. ఆంధ్రప్ర‌దేశ్ విభ‌జ‌న త‌రువాత ఇరు రాష్ట్రాల్లో భారీగా పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని అంద‌రు అనుకుంటారు. అలాగే తెలంగాణ‌లో పెట్టుబ‌డులు బాగానే వ‌స్తున్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీలో కూడా పెట్టుబ‌డులు ప‌ర్లేదు అన్న విధంగానే వ‌చ్చాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత చెప్పుదొగ్గ పెట్టుబ‌డులు రాక‌పోగా అస‌లు ఆంధ్ర వైపు పెట్టుబ‌డిదారులు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు.

  అయితే  కొత్త‌గా పెట్టుబ‌డులు రాక‌పోగా ఉన్న కంపెనీలే ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లి వెళ్లిపోతున్నాయి. ఈ విధంగా పెట్టుబ‌డులు రాక‌పోగా ఉన్న సంస్థ‌లే త‌ర‌లిపోవ‌డం పై ఏపీ ప్ర‌తి ప‌క్షాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఏపీలో సంక్షేమ ప‌థ‌కాలు బాగానే ఉన్నా, అవి అభివృద్ధి సూచిక‌లు కావ‌ని ప‌లువురు నేత‌లు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. గతంలో కొన్ని కంపెనీలు ఆంధ్ర నుంచి త‌ర‌లిపోయాయి. తాజాగా అమ‌ర్‌రాజా కంపెనీ ఆంధ్ర ప్ర‌దేశ్‌కు రామ్ రామ్ చెప్పేలా క‌నిపిస్తోంది.

   ఇటీవ‌ల ఆ కంపెనీకి చెందిన భూముల ఒప్పందాల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తోంది. అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌కు చెందిన భూముల ఒప్పందాల‌ను ఏపీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తూ జీవోను జారీ చేసింది. దీనిపై ఆ కంపెనీ నిర్వాహ‌కులు కోర్టును ఆశ్ర‌యించారు కూడా. త‌రువాత ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోను కొట్టివేసింది కోర్టు. దీంతో త‌మ‌కు ఊర‌ట ల‌భించింద‌నుకునేలోపే అమ‌ర‌రాజా కంపెనీకీ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్ట్ షాక్ ఇచ్చింది. ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌పై కంపెనీకి నోటీసులు జారీ చేసింది.
 
 
   
రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అమరరాజా కంపెనీ నిర్వ‌హ‌కులు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడుకు త‌మ కంపెనీనీ త‌ర‌ళించార‌ని భావించారు. దీని కోసం  కంపెనీ నిర్వహాకులు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలి అమరరాజా బ్యాటరీస్‌కు అనుమతి ఇవ్వాలని అభ్య‌ర్థించారు. దీంతో  అమరరాజా బ్యాట‌రీస్‌కు భూమి కూడా కేటాయించింది త‌మిళ‌నాడు గ‌వ‌ర్నమెంట్‌. దీంతో అక్కడ పనులు కూడా ప్రారంభించారు కంపెనీ నిర్వ‌హ‌కులు. మరో మూడు నెలల్లో అమరారాజా బ్యాటరీస్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: