ప్రధాని మోడీ  2024లో వచ్చేటువంటి ఎన్నికల ప్రచారంలో  ముందస్తు జాగ్రత్తగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. పక్కా ప్లానింగ్ ప్రకారం వారు గురిపెట్టిన ఎన్నికలలో విజయం సాధించడం కోసం మోడీ బ్యాచ్ ముందుగానే సిద్ధం అవుతుందని చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్ లాంటి ప్రత్యేక పరిస్థితులను తప్పించి, అటు మోడీ, ఇటు అమిత్ షా ఎన్నికల వ్యూహాలు పక్కాగా వర్కవుట్ చేయడం మనకు తెలిసిన విషయమే. మరో మూడు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో  మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని, మూడోసారి అధికారంలో ఉన్న పార్టీగా హ్యాట్రిక్ కొట్టాలని బిజెపి  పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని పోతోంది.

ప్రజల్లో ఎన్నికల మూడు తేవడం కోసం సంవత్సరన్నర ముందు నుంచే  ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు పాదయాత్ర లాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. మోడీ సర్కార్ ఎన్నికలకు మూడు సంవత్సరాల ముందు నుంచే  సిద్ధమవడం చూస్తుంటే చాలా ఆసక్తిని రేపుతోంది. అధికార పార్టీ ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం ఊరుకుంటాయా వారు కూడా ప్రణాళిక వేసుకొని ముందుకు పోతారు అని చెప్పక తప్పదు. బీజేపీ ఎన్నికల కోడ్  మరియు రూట్ మ్యాప్ చూస్తే  కేబినెట్ మంత్రులు కూడా  19 రాష్ట్రాల్లో  ఎక్కడికక్కడ యాత్రలు నిర్వహించడానికి వీలుగా  సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆగస్టు 16 నుంచి 43 మంది కేంద్ర మంత్రులు యాత్ర నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యొక్క మంత్రులు చేపట్టే యాత్ర మొత్తం  15 వేల కిలోమీటర్లు కవర్ చేసేలా ఉంటుందని వారు చెబుతున్నారు. ఒక్కొక్క మంత్రి  300 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తారని ప్రచారం సాగుతోంది.

ప్రతి కేంద్ర మంత్రి  తాను ప్రాతినిధ్యం వహించే  నియోజకవర్గం నుంచి ఈ యాత్రను షురు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో మంత్రి కనీసం 3 నుంచి 4 లోక్ సభ స్థానాలు ప్రచారం చేసేలా రూట్ మ్యాప్ ఉన్నట్టు సమాచారం. దీని ద్వారా  కార్యకర్తల్లో జోష్ పెరిగే పార్టీకి లాభం చేకూరుతుందని వారి  అభిప్రాయం. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఈ యాత్రలు ఉంటాయని సమాచారం. ఈ ప్రచారంలో  అప్పుడప్పుడు  అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా లు కూడా ఉంటారని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలకు  మోడీ సర్కార్ ఆపరేషన్ మొదలు పెట్టిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: