భారత్ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 30వేల 549కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగాకరోనా కారణంగా 422మంది బలైనట్టు తెలిపింది. అటు 38వేల 887మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 17లక్షల 26వేల 507కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 25వేల 195కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4లక్షల 4వేల 958గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 47.85కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు.

ఇక పశ్చిమ బెంగాల్ లో అయితే వృద్దులు, అనారోగ్యంతో మంచానపడిన వారికి ఇంటి దగ్గరే టీకాలు వేస్తామని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. 80ఏళ్లు పైబడిన వృద్ధులు, 60ఏళ్లు దాటి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ కు అర్హులని తెలిపింది. ఇందుకోసం కుటుంబ సభ్యులే.. లబ్ధిదారుల పేరును స్థానిక వ్యాక్సినేషన్ సెంటర్ లో నమోదు చేయాలి. అంతేకాకుండా ఇంట్లో వారంతా అప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలట.

కరోనా వ్యాక్సిన్ విషయంలో భువనేశ్వర్ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే 100శాతం మందికి టీకాలు వేసిన మొదటి సిటీగా రికార్డు సొంతం చేసుకుంది. టీకాలు వేయించుకున్న వారిలో.. 18నుండి 44 ఏళ్ల వారు 5లక్షల 17వేల మంది, 45ఏళ్లు దాటిన వారు 3లక్షల 25వేల మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18ఏళ్లు నిండిన వారికే వ్యాక్సిన్ వేస్తున్నారు.

మరోవైపు డెల్టా వేరియంట్ వల్ల భారత్ కు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశముందనీ.. రెండు దశల మధ్య థర్డ్ గ్యాప్, తీవ్రత, కేసుల పెరుగుదల ఆధారంగా అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 130దేశాలకు పాకిన ఈ వేరియంట్.. అమెరికా, జపాన్, మలేషియా, ఇరాన్ లో ప్రతాపం చూపిస్తోంది.





 

మరింత సమాచారం తెలుసుకోండి: