వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డిని సీబీఐ సుదీర్ఘంగా విచారణ చేసింది. సుమారు పది గంటల పాటు దేవేందర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. హైకోర్టు జడ్జ్ ల పై అనుచిత పోస్టులు పెట్టి విపరీత వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో దేవేందర్ రెడ్డి ని విచారించిన సీబీఐ అధికారులు విచారించారు. విచారణ అనంతరం వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కేసులు గురించి నాకు నోటీసు ఇచ్చారని, సిబిఐ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. కేసులు మాకు కొత్త కాదు.. గత పదేళ్లుగా మా వాళ్ళ పైన 640 కి పైగా కేసులు పెట్టారన్న ఆయన అప్పుడు భయపడలేదు..ఇప్పుడు భయపడమని అన్నారు.



 వైసీపీ ఎప్పుడు వ్యవస్ధలపైన పోలేదు...ఇప్పుడు కూడా పోదని అన్నారు. చంద్రబాబు ప్రోద్భలంతోనే  కొంతమంది కేసులు పెట్టారన్న దేవేందర్ రెడ్డి సుమారు వందపైన కేసులు పెట్టారని, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అయితే ఆయన పేరు అమర్ నాథ్ రెడ్డి అని పేరు పెట్టించారని అన్నారు. చంద్రబాబు వైసీపీ సోషల్ మీడియాను ఎదుర్కోలేక కుట్రలకు పాల్పడుతున్నారని, చంద్ర బాబు కు దమ్ము, ధైర్యం ఉంటే వైసీపీ సోషల్ మీడియాను ఎదుర్కోవాలనింనారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అండగా వైసీపీ కార్యకర్త ఉంటాడని ఆయన అన్నారు. చంద్రబాబు ఏం చేయలేరన్న ఆయన చట్టమంటే అందరికీ ఒక్కటేనని అన్నారు. 


టిడిపి వాళ్లు ముఖ్యమంత్రిని తిడితే కేసులుండవన్న ఆయన మాపైన మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారు ..ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని బదనాం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, ఇలాంటి కేసులపై నిజాయితిగా పోరాడతామని అన్నారు. సీబీఐ అధికారులు అవసరమైతే మరలా పిలుస్తామన్నారు.. అవసరమైతే మరలా విచారణకు పిలిస్తే హాజరవుతా అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: