మ‌రో ఎన్టీఆర్ ఆయ‌నే : రాయ‌ల సీమ రామ‌న్న రెడ్డి

ప్ర‌జ‌లే దేవుళ్లు
స‌మాజ‌మే దేవాల‌యం
అన్న‌ది ఎన్టీఆర్ మాట

అదే మాట నినాదం అయింది
కాంగ్రెస్ కోట కూలింది

ఫ‌క్తు టీడీపీ నాయకుల‌ను కొంద‌రిని త‌యారు చేసింది
ఆ కోవ‌లో ఆ కోటాలో కొంద‌రు మాత్రమే ఎన్టీఆర్ లు
ఆ వివరం ఈ క‌థ‌నంలో

రోడ్డుపై ప‌డుకోవాలి.. రోడ్డుపైనే స్నానం చేయాలి.. ప్ర‌జ‌ల‌లో క‌లిసి ప్ర‌జ‌ల‌తో క‌లియ‌దిరిగి వారి క‌ష్టం వారి బాధ అన్న‌వి తెలుసు కోవాలి. ఇదీ ఆనాడు రామ‌న్న ఆలోచ‌న. పాల‌న‌కు కమ్యూనిజం ఆపాదించారు. క‌మ్యూనిస్టు సిద్ధాంతం ఆచ‌రించారు.ఆ విధంగా త‌న మ్యానిఫెస్టో రూపొందించారు. ఆ తోవ‌లో మ‌రో నాయ‌కుడు అచ్చం ఎన్టీఆర్ లానే ప‌నిచేస్తున్నారు. పాల‌క ప‌క్షం  బెదిరింపుల కు అద‌ర‌క బెద‌ర‌క ప‌నిచేస్తూ పోతున్నారు. త‌న మాటే శాస‌నం అన్నంత స్థాయికి అనంత రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తున్నా రు. బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గ నేత‌గా ఉండి అదే సామాజిక‌వ‌ర్గంకు చెందిన సీఎంను ఢీ కొంటున్నారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.

అచ్చం ఎన్టీఆర్ లానే రోడ్డుపైనే స్నానం చేస్తూ, నాటి రామారావును స్ఫురింప జేస్తున్నారు. తాడిప‌త్రి  లో వైసీపీ ఆగ‌డాల‌కు భ‌య ప‌డేదే లేద‌ని చెబుతున్నారు. కొన్ని కేసులు కొన్ని బెదిరింపులు ఉన్నా కూడా తాను మాత్రం వెనుకంజ వేసేదే లేద‌ని కార్య‌క‌ర్త‌ల్లో ఆత్మ విశ్వాసం నింపుతున్నారు.

తాడిప‌త్రి మున్సిపాల్టీకి సంబంధించి వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌లోనూ చ‌క్రం తిప్పారు. మున్సిప‌ల్ ఆఫీసుకు పోకుండా త‌న మాటే నెగ్గిం చుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పై రామారావు పోరాడి నెగ్గితే, ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన నేత‌గా పేరున్న ప్ర‌భాక‌ర్ రెడ్డి కాంగ్రెస్ మూలాలున్న వైసీపీతో వెనుకంజ వేయ‌క త‌ల‌ప‌డుతున్నారు.త‌న‌కు ఎదురేలేద‌ని మీసం మెలేసి చెబుతున్నారు. నా మీసం - నా ఇష్టం నా అనంత - నా రాజ్యం అన్న ధీమా నొక‌టి వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిం చిన ప్ర‌తిసారీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ సెంట‌ర్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఎప్పుడో తార‌క రామారావు ఇలానే పోరాడారు. లాఠీ దెబ్బ‌ల‌కు వెను క‌డుగు వేసేదే లేద‌ని అన్నారు. అలా వైసీపీ ప్ర‌భుత్వంలో ఈ రామారావు రెడ్డి ఎదురొడ్డి పోరాడ‌డం కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఉత్సాహానికి కార‌ణం అవుతోంది.




 

మరింత సమాచారం తెలుసుకోండి: