న‌కిలీ గోల్డ్ బిస్కెట్‌ల దందా తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. నిజానికి డ‌బ్బులు కొద్దిగా ఎక్కువ‌గా ఉంటే కొంద‌రు బంగారు బిస్కెట్‌ల‌ను కొనుక్కుని పెట్ట‌కుంటారు. ఎందుకంటే గొల్డ్ పై ఎంత ఇన్వెస్ట్ మెంట్ పెట్టినా రిస్క్ ఉండ‌దు, పైగా బంగారం ధ‌ర రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. అదే బంగారం ఓ రెండు వేల రూపాయ‌లు త‌క్కువ‌గా వ‌స్తుంది అంటే అటు వైపే వెళ్తారు. అదే మోనోగ్రామ్ 99.99 గ్రాముల స్వ‌చ్చ‌మైన బంగారం అని స్టాంప్ ఉండ‌డంతో న‌మ్మ‌కంగా కొనుగోలు చేస్తున్నారు ప్ర‌జ‌లు.

  ఇది ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బ‌ల్క‌సుమ‌న్ ప్రాతినిద్యం వ‌హిస్తున్న చెన్నూరు నియోజ‌వ‌ర్గంలో ఈ న‌కిలీ బంగారు బిస్కెట్ల దందా కొన‌సాగుతోంది. ఇక్క‌డ అడ్డు అదుపు లేకుండా గోల్డ్ బిస్కెట్ల‌ను విక్ర‌యించ‌డంతో పోలీసుల‌కు ప‌లు ఫిర్యాదులు అంద‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగు చూసింది. ఈ న‌కిలీ గోల్డ్ దందా మంచిర్యాల నుంచి చెన్నూరు అడ్డ‌గా మారింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. కానీ పోలీసుల‌కు పై నుంచి ఈ విష‌యంలో క‌ల్పించుకోకుండా రాజ‌కీయ ఒత్తిడి వ‌స్తోంద‌ని తెలుస్తోంది.
 

  అస‌లు ఈ న‌కిలీ బంగారం ఎలా త‌యారు చేస్తారంటే.. బంగారాన్ని క‌రిగించే స‌మ‌యంలోనే ఈ న‌కిలీ బంగారం దందా మొద‌ల‌వుతుంది. 99.990 బ‌రువు ఉండే విధంగా అందులో వెండిని క‌లుపుతారు. దీంతో త‌క్కువ ధ‌ర‌కే ఈ బిస్కెట్లు విక్ర‌యిస్తారు. గ‌తంలో ఎన్ని ఫిర్యాదులు వ‌చ్చినా ఈ విష‌యంపై స్పందించ‌ని పోలీసులు ఇప్పుడు బాధితుల ఫిర్యాదుతో క‌దిలార‌ని తెలుస్తోంది. తీగ లాగితే డొంక క‌దులుతుంది అన్న‌ట్టుగా.. అధికార పార్టీ ఎమ్మెల్యే బ‌ల్క‌సుమ‌న్ ఎమ్మెల్యే గా ఉండ‌డంతో ఈ వ్య‌వ‌హారం అంతా అధికార పార్టీ కి చుట్టుకుంటుంది.



ఈ నేప‌థ్యంలో ఓ బ‌డా రాజ‌క‌య నేత ఈ న‌కిలీ బంగారు బిస్కెట్ల దందా మీద పోలీసుల‌పై ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ట్టు స‌మాచారం. కానీ పోలీసులు మాత్రం ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా త‌గ్గేది లేదంటున్నారు. చివ‌రికి వ‌ర‌కు ఏమ‌వుతుందో తెలియ‌దు కానీ. న‌ష్ట‌పోయిన‌ బాధితుల‌కు న్యాయం జ‌రుగుతుందా, దందా చేసే ముఠాను అస‌లు ప‌ట్టుకుంటారా అనుమానాలు ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్తం అవుతోంది. అస‌లు వారికి న‌ష్ట‌పోయిన సొమ్మును ఎలా తిరిస్తారు, కేసును చివ‌రి వ‌ర‌కు కొన‌సాగిస్తారా..?   నీరు గారుస్తారా ? అంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: