అపార్ట్మెంట్లు సేఫేనా!

పెరుగుతున్న ధ‌ర‌ల‌కు అనుగుణంగా మ‌ధ్య త‌ర‌గ‌తి జీవికి సొంత ఇల్లు ఓ అంద‌ని వ‌స్తువు అయిపోతోంది.మార్కెట్లో ఊహించ‌ని మార్పులు కార‌ణంగా సామాన్యుడికి సొంత ఇల్లు త‌ల‌కుమించిన భారంలా మారుతోంది.ఈ నేపథ్యంలో కొన్ని వెంచ‌ర్లు వేసి ప్ర‌యి వేటు సంస్థ‌లు, అదేవిధంగా టౌన్ షిప్పులూ, ఇదే బాట‌లో కొన్ని ప్ర‌భుత్వ సంస్థ‌లు అపార్ట్మెంట్ నిర్మాణాల‌కు ముందుకు వ‌స్తున్నా యి. సామాన్యుడి సొంత ఇంటి క‌ల‌ను సాకారం చేసేందుకు ప్ర‌ధాని స్థాయి నుంచి ముఖ్య‌మంత్రి స్థాయి వ‌ర‌కూ అంతా ఏవో ప‌థకా లు తెచ్చి, సంబంధిత ప‌నులు చేప‌ట్టమ‌నేవారే..ఈ కోవలోనే కొన్ని ప్ర‌యివేటు, కార్పొరేట్ సంస్థ‌లు కూడా లోన్లు రూపేణ, లేదా ఆ ఫర్ల రూపేణ అపార్ట్మెంట్ల‌ను నిర్మించి ఇస్తామ‌ని సుల‌భ వాయిదాల‌లో చెల్లిస్తే సరిపోతుంద‌ని న‌మ్మ‌బ‌లికి ఈ రొంపిలోకి దించుతు న్నాయి.

ముందు ప్ర‌యివేటు, కార్పొరేట్ సంస్థ‌ల గురించి మాట్లాడుకునే క‌న్నా ప్ర‌భుత్వం నిర్మించిన గృహ స‌ముదాయాలు ఎలా ఉన్నా యో చూద్దాం. వాటి నిర్మాణంలో పాటించిన ప్ర‌మాణాలు,  వాటి కోసం అధికారులు చెప్పిన మాట‌లు ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే ఎక్క‌డా కూ డా అవి అమ‌లుకు నోచుకునేలానే లేవు. వాంబే గృహాల పేరిట రాజ‌శేఖ‌ర్ రెడ్డి, హుద్ హుద్ ఇళ్ల పేరిట చంద్ర‌బాబు క‌ట్టించిన గృ హ స‌ముదాయాలు అన్నీ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల త‌ర‌హాలోనే నిర్మాణం అయి ఉన్నాయి. ఇవ‌న్నీ ఇప్పుడు అవ‌సాన ద‌శ లో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ సంబంధిత అధికారులు వీటిని ప‌ట్టించుకోరు. హౌసింగ్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం కార‌ణంగా కొ న్నింట   వాంబే కాల‌నీల్లో నిర్మాణానికి నోచుకున్న బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు ఎప్పుడు కూలుతాయో తెలియ‌వు.  అయినా ప్ర‌త్యామ్నాయం లేక ఇక్క‌డే కాలం గడుపుతున్న వారెంద‌రో .. ఇప్పుడు ఇదే త‌ర‌హా లో పెచ్చులూడి, స్తంభాలు కూలి ఉన్న అపా ర్ట్మెంట్లు కూడా అటు విశాఖ‌లోనూ, ఇటు ఇత‌ర జిల్లాల‌లోనూ ఉన్నాయి. వీటిని నిర్మించిన కార్పొరేట్ సంస్థ‌లు ముంందు అంద‌మ యిన బ్రోచ‌ర్ల‌తో రంగంలోకి దిగి, బ్రోక‌ర్ల‌కు క‌మీష‌న్లు చెల్లించి ఇళ్ల నిర్మాణం సాగించి త‌రువాత అక్క‌డి నుంచి త‌మ‌కేం ప‌ని అన్న విధంగా త‌ప్పుకుంటున్నారు. ఇదే విధంగా అన్ని చోట్లా  బిల్డ‌ర్లు ఉన్నార‌ని చెప్ప‌లేం కానీ నాణ్య‌తా ప్ర‌మాణాల పాటింపు పై ఎవ్వ‌రి నిఘా లేక‌పోవ‌డంతో ఎవ‌రికి తోచిన విధంగా వారు డ‌బ్బులు గుంజుకుంటూ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌ను దోచుకుంటున్నారు. పేద వర్గాల‌న్నీ ప్ర‌భుత్వం క‌ట్టించిన బహుళ అంత‌స్తుల భ‌వ‌నాల‌తో స‌త‌మ‌తం అవుతుంటే, ప్ర‌యివేటు కంపెనీల దోపిడీకి మ‌ధ్య త‌ర‌గ‌తి వాసులు బ‌లై పోతున్నారు. తాజాగా భీమ‌వ‌రంలో శ్రీ‌నివాస అపార్ట్మెంట్ ఓ ఉదాహ‌ర‌ణ. ఈ భ‌వ‌నం ఇప్ప‌టికే పెచ్చులూడి పోయి కొన్ని స్తంభాలు ప‌క్కకు ఒరిగి ఉంది. ఎప్పుడు కూలిపోతుందో అన్న భ‌యంలో ఇక్క‌డి స్థానికులు ఉన్నారు. కానీ అధికారులు మాత్రం ఇటుగా రావ‌డం లేదు. ఇదే విధంగా అనుమ‌తులు మంజూరు చేసేట‌ప్పుడు చూపే ఉత్సాహం, త‌రువాత నాణ్య‌తా ప్ర‌మాణాల ఆచ‌ర‌ణలో ఉండ‌క‌పోవ‌డంతో చాలా భ‌వ‌నాలు కుప్ప‌కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అపార్ట్మెంట్ క‌ల్చ‌ర్ పెరిగి అదొక స్టేట‌స్ సింబ‌ల్ గా మారాక చాలా ప్రాంతాల‌లో బిల్డ‌ర్ల మోసాలూ పెరిగిపోతున్నాయి. ఇదే ప్ర‌శ్నించి పోలీసు స్టేష‌న్ల‌కు వారిని ఈడ్చుకు వెళ్లి అప్ప‌గించినా ఫ‌లితం లేక‌పోతోంది. దీంతో చేసిన అప్పులు తీర్చ‌లేక, బ్యాంకుల‌కు వ‌డ్డీలు చెల్లించ‌లేక అస‌లు ఇక్క‌డ ఉంటే ప్రాణాల‌కు ర‌క్ష ఉంటుంద‌న్న హామీ లేక సామాన్యులు ల‌బోదిబోమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap