ఎన్నొ ఏళ్ల నుంచి క‌శ్మీర్ పై భారత్ దాయాది దేశం కుట్ర‌లు ప‌న్నుతూనే ఉంది. క‌శ్మీర్ త‌మ దేశంలోని భూభాగామ‌ని అతి త‌మ దేశాకే చెందుతుంద‌ని ప‌లు సార్లు వితండ వాదం చేస్తూనే ఉంది అంత‌ర్జాతీయంగా ఈ వివాదంపై భార‌త్‌ను ఇరుకున పెట్టాల‌ని చూసింది. చైనా బ‌లంతో పాక్ ఈ విధంగా భార‌త్ కు వ్య‌తిరేకంగా మాట్లాడుతూ.. వ‌స్తోంది. దీని పై భార‌త్ ధీటు గా స్పందిస్తూ వ‌చ్చింది. ఈ విష‌యం భార‌త్ అత‌ర్గ‌త విష‌యం అని ఎవ‌రూ త‌ల‌దూర్చాల్సిన అవ‌స‌రం లేదని తేల్చి చెప్పింది. అయితే ఇదే విష‌యంపై ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టిన అధ్యక్ష స్థానాన్ని భార‌త్ చేప‌ట్టిన సంద‌ర్భంగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

    ఈ స‌మావేశంలో పాకిస్తాన్‌తో భార‌త్ స‌త్సంబంధాలు, అఫ్ఘ‌నిస్తాన్ అంశాల‌పై కూడా తిరుమూర్తి చ‌ర్చించారు,. ఈ సంద‌ర్భంగా జమ్ముకశ్మీర్ భారత్ అంతర్భాగమని, ఇకపై ఏదైనా అంశంపై చర్చించాలంటే అది పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గురించే అని ఆయ‌న తెలిపారు. ఐక్య‌రాజ్య భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఇండియా చేప‌ట్టిన క్ర‌మంలో.. తిరుమూర్తి తీరప్రాంత భద్రత, ఉగ్రవాద నిరోధం, శాంతి పరిరక్షణ మొదలైన కీలక అంశాలపై సంతకాలు చేయనున్నట్లు  పేర్కొన్నారు.  


జమ్ముకశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని ఆయ‌న మ‌రోసారి స్పష్టం చేశారు.  ఐరాస భద్రతా మండలి సభ్యులు కూడా ఈ అంశంపై చర్చించేందుకు అసమ్మతి చూపారని ఆయ‌న వివ‌రించారు. "పాకిస్థాన్తో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంద‌న్న తిరుమూర్తి, భారత్- పాక్ మధ్య ఏవైనా సమస్యలుంటే.. ద్వైపాక్షిక, శాంతియుత చర్చలతో వాటిని పరిష్కరించుకోవాలి అని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెల్ల‌డించారు. అఫ్గాన్ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింద‌ని, ఆ దేశంలో రోజురోజుకు హింస పెచ్చ‌రిల్లిపోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

  భార‌త్‌లో ఉగ్ర‌వాద స్థావ‌రాలు లేవ‌ని, అఫ్గనిస్తాన్ ప‌రిస్థితుల ప్ర‌భావం భార‌త‌దేశంపై తీవ్రంగా ఉంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. స్వ‌తంత్ర‌, శాంతియుత‌, ప్ర‌జాస్వామ్య దేశంగా అఫ్గ‌నిస్తాన్‌ను చూడాల‌ని భార‌త్ కోరుకుంటోంద‌ని తెలిపారు. ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి అధ్యో ప‌ద‌విని చేప‌ట్టిన భార‌త్ ఆగ‌స్టు నెల మొత్తం వ‌ర‌కు ఈ ప‌ద‌విలో భార‌త్ కొన‌సాగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: