అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో  ఆయనకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ  నేతలందరితో విభేదించి ఇక పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ సమయంలో ఇక జగన్ అక్రమాస్తులపై ఎన్నో కేసులు కూడా పెట్టింది కాంగ్రెస్. ఈ కేసులు ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అక్రమాస్తుల కేసు విషయంలో తనకు బెయిలు మంజూరు చేయాలంటూ సీఎం జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత కొంత కాలం నుంచి దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది.



 అయితే జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయవద్దు అంటూ ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న టిడిపి న్యాయ స్థానాన్ని డిమాండ్ చేస్తుంది. నేరస్తులకు శిక్ష పడాల్సిందే అంటూ చెబుతుంది. అదే సమయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఏకంగా బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ   పలుమార్లు లేఖలు రాయడం కూడా సంచలనం గా మారిపోయింది. ఇలా ఓ వైపు రఘురామకృష్ణంరాజు మరోవైపు టిడిపి నేతలు జగన్ బెయిల్ పిటిషన్ పై విమర్శలు చేస్తున్న సమయంలో ఇటీవలే కాంగ్రెస్ నేత చింతా మోహన్ జగన్ బెయిల్ పిటిషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 జగన్ బెయిల్ పిటిషన్ రద్దు కావడం ఖాయం అని ఇటీవలే చింతా మోహన్ తెలిపారు. ఇక మరికొన్ని రోజుల్లో సీఎం జగన్ జైలుకు వెళ్లపోతున్నారని.. దీంతో  కొన్ని వారాల్లో సీఎం జగన్ మాజీ సీఎం కాబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చింతా మోహన్. ఇటీవలే చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఒకప్పుడు జగన్ పై అక్రమ కేసులు రావడానికి కూడా చింతా మోహన్  కావడం గమనార్హం. ఇక ఇప్పుడు చింతామోహన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి ఈ స్టేట్మెంట్ ఇచ్చారా.. లేదా ఊహాజనితంగా స్టేట్మెంట్ ఇచ్చారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: