ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈటెల వ్యవహారం రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం హుజురాబాద్ ప్రజల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా అధికార పార్టీ ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తుంది.  ఎట్టి పరిస్థితుల్లో ఈటలను ఓడించాలని ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగి.. హుజరాబాద్ నియోజకవర్గానికి భారీగా పథకాలు భారీగా నిధులు సైతం కేటాయిస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను సైతం టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.



 ఇప్పటికే బీజేపీ నుంచి పెద్దిరెడ్డి, టీడీపీ నుంచి ఎల్.రమణ, ఇక కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి లాంటి నేతలను టిఆర్ఎస్లో చేర్చుకున్నారు. అదే సమయంలో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇదిలా ఉంటే అటు కేటీఆర్ రాజకీయ వారసుడు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినూత్న రీతిలో వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈటలపై  ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేందుకు కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు.



 ఈటెల రాజేందర్ కు సంబంధించి ఎంతో టెక్నికల్గా వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  పూర్తిగా ద్వేషంతో కాకుండా పాజిటివిటి తో కూడిన ద్వేషంతో పోస్టులు పెడుతున్నారు కేటీఆర్..  ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వదిలి స్వతంత్రంగా పోటీచేసిన బాగుండేదని..  టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగానే ఉంటుంది.. అందుకే మీరు బిజెపి తరఫున పోటీ చేయడం వల్ల మేము ఈటలను కూడా వ్యతిరేకిస్తున్నాము అంటూ ఇక సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టడం వాటిని వైరల్ గా మార్చడం లాంటివి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ని అస్త్రంగా  మార్చుకున్న కేటీఆర్ ఈటెల పై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ktt