హైదరాబాద్ నగరంలో దిశ అనే వెటర్నిటీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అప్పట్లో అమాయకురాలైన వెటర్నరీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ ఎంతో మంది నిరసనలు కూడా తెలిపారు.  అయితే ఇక ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న సమయంలోనే హైదరాబాద్ పోలీసులు దిశ కేసు  లో నలుగురు నిందితులను కూడా ఎన్కౌంటర్ చేసి చంపడం దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. కేసు రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఇక నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని అందుకే ఎన్కౌంటర్ చేసాము అంటూ పోలీసులు దీనిపై వివరణ ఇచ్చారు.




 అయితే ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరిపించేందుకు అటు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది  అదే సమయంలో కేంద్రం నుంచి మానవ హక్కుల సంఘం కూడా వచ్చి విచారణ జరిపించింది. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం  విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించాల్సి  ఉంది. అయితే ఇటీవలే ఇక దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా  దిశ ఎన్ కౌంటర్ పై విచారణ కమిటీ ఇంకా విచారణ కొనసాగిస్తున్నారని దీనికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించడానికి ఇంకా కొంత సమయం కావాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.



 అయితే అటు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.  దిశ ఎన్ కౌంటర్ కేసు పై నివేదిక సమర్పించాలని కోరినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వం సమయం కావాలి అంటూ అడుగుతుంది. ఇలా పదే పదే సమయం ఎందుకు అడుగుతున్నారు అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే దిశ ఎన్కౌంటర్ కేసులో ఏకంగా 170  మందిని ప్రశ్నించామని.. ఇంకెంత మందిని ప్రశ్నించాలి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. ఇక చివరికి దిశ ఎన్ కౌంటర్ కేసు నివేదిక సమర్పించడానికి ఆరునెలల సమయం కేటాయించింది సుప్రీం కోర్టు.  ఆరు నెలల్లోగా తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని అంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: