ఓవ‌ర్ టు హ‌రీశ్ : వీల్ ఛైర్ టు ఎమ్మెల్యే ఛైర్ !

ఇంత క‌న్నా మంచి మాట‌లు ఏమ‌యినా
మాట్లాడండి హ‌రీశ్..అంటున్నారు ఈటెల

ఆరోగ్యం కుదురుగా లేక ఆస్ప‌త్రిలోఉంటే
ఆయ‌నది సానుభూతి రాజ‌కీయం అంటున్నారు
హ‌రీశ్

మంత్రి స్థాయి మారిపోయి మ‌రీ దిగ‌జారి
ఇలా మాట్లాడ‌డం త‌గ‌దు క‌దా! అని ఈటెల

వీల్ ఛైర్ లో వ‌స్తారు ఎమ్మెల్యే అయిపోతారు
అని కొన్ని వెగ‌టు మాట‌లు కూడా మాట్లాడారు
హ‌రీశ్

ఇద్ద‌రు స్నేహితులు..అత్యంత స‌న్నిహితులు..ఒక‌రంటే ఒక‌రికి ప్రాణం..ఒక‌రికి ఒక‌రంటే బాగా తెలుసు..అలాంటి వారు శ‌త్రువులు అయిపోయారు..నిన్న‌టి స్నేహాలు త‌లుచుకోకుండా తిట్టుకుంటున్నారు. ఈటెల పై హ‌రీశ్ అనరాని మాట‌లు అంటున్నార‌ని బీజేపీ మండిప‌డుతోంది. ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నా కూడా ఇలాంటి మాట‌లు ఎలా వ‌స్తాయి అని అంటోంది. హ‌రీశ్ రావు మాత్రం ఆయ‌న త్వ‌ర‌లో వీల్ ఛైర్ లో వ‌స్తార‌ని, ప్ర‌చారం చేస్తార‌ని, ఒళ్లంతా క‌ట్ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌చారం చేయనున్నార‌ని ఇలా ఏవేవో అంటున్నారు. ఇవాళ సిద్ధిపేట కేంద్రంగా ఆయ‌న కొంద‌రు హుజూరాబాద్ నేత‌ల‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య లు దుమారం రేపుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంలో ఏమ‌యినా కావొచ్చు.. ఏమ‌యినా మారొచ్చు. కానీ మ‌న‌సులు గాయ‌ప‌డేలా హ‌రీశ్ రావు మాట్లా డ‌డం అన్న‌ది ఆయ‌న స్థాయికి త‌గదు అని కొంద‌రు విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు కే సీఆర్ కూడా ఈటెల‌పై గెలిచేందుకు ఓ బీసీ నేత వెతుకులాట‌లోనే ఉన్నార‌ని స‌మాచారం. ఆయ‌న కూడా ఈటెల క్యాస్ట్ కార్డ్ పైనే ఎటాక్ చేయ‌నున్నారు అని కూడా తె లుస్తోంది. ఇలా ఈటెల‌ను మాన‌సికంగా దెబ్బ‌తీసి బ‌రి లో నుంచి త‌ప్పుకునేలా చేయ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యం అని కొంద‌రు చెబుతు న్నారు.ఈటెల పార్టీ వీడిపోయినా స‌రే క్యాడ‌ర్ మొత్తం త‌మ‌తోనే ఉంద‌ని పేర్కొంటూ మ‌రికొన్ని కీల‌క వ్యాఖ్య‌లు బీజేపీపై చేయ‌డంతో హ‌రీశ్ రావును మ‌రింత టార్గెట్ చేసేందుకు, ఈటెల‌కు మాన‌సికంగా ధైర్యం ఇచ్చేందుకు బీజేపీ లీడ‌ర్లు స‌మాయ‌త్తం అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: