గతంలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే  25 వేల లీటర్ల నీటిని కూడా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ హామీ ఇప్పటికే అమలు లోకి కూడా వచ్చింది. అదే సమయంలో ఇక జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న సెలూన్లు, లాండ్రీ షాప్ లకి కూడా ఉచితంగా 250 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తాము అంటూ హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం.



 ఇక మరికొన్ని రోజుల్లో అర్హులైన వారందరికీ కూడా ఇచ్చిన హామీ మేరకు హెయిర్ సెలూన్, లాండ్రి దుకాణాలకు కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఎంతో మంది 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ పథకం పొందాలనుకునే సెలూన్, లాండ్రీ షాప్ ల దుకాణాల యజమానులు వెంటనే మీ సేవ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  సూచించారు. అదే సమయంలో మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.



 ఇక ప్రభుత్వం అందించబోతున్న ఉచిత విద్యుత్ పథకానికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం పూర్తిగా ఉచితం అంటూ తెలిపారు  అయితే ఇప్పటివరకు కేవలం తక్కువ మంది మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ఇటీవలే ప్రభుత్వ ప్రకటనతో  ఎంతోమంది సెలూన్లు,లాండ్రీ షాపుల యజమానులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.  ఈ క్రమంలోనే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే సేవలు కూడా ఉచితం అని తెలియడంతో ఎంతోమంది మీ-సేవ కేంద్రాలకు బారులు తీరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: