సంపన్నులు జీవితంలో ఏది కావాలన్నా అది వెంటనే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక కార్ల విషయానికి వస్తే.. మార్కెట్లోకి కొత్త కారు వస్తే నచ్చితే చాలు కొనేస్తూ ఉంటారు. కానీ పేద మధ్య తరగతి ప్రజల పరిస్థితి అలా ఉండదు.. పేద మధ్యతరగతి ప్రజలకు కారు కొనడం అనేది ఒక కళగా ఉంటుంది. దీని కోసం ఎన్నో సంవత్సరాల నుంచి సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మంచి ఆఫర్ వచ్చినప్పుడు కారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో పేద మధ్యతరగతి ప్రజల యొక్క కార్ కొనాలనే కల  నెరవేర్చడానికి ఎన్నో బ్యాంకులు కూడా లోన్ సదుపాయాలు కల్పిస్తూ ఉండటం చూస్తున్నాం.



 ఈ లోన్ సదుపాయం లో కూడా వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఒకవేళ మీరు ప్రస్తుతం కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తే మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ సిద్ధంగా ఉంది. దేశీయ దిగ్గజం గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఇటీవలే కార్ లోన్ పై ఏకంగా వడ్డీరేటును తగ్గిస్తూ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే కేవలం కియా కారు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.



 అంతేకాకుండా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్న ఈ అదిరిపోయే ఆఫర్ పొందాలి అనుకుంటే తప్పనిసరిగా ఎస్బిఐ  యోనో యాప్ ద్వారా ఇక కియా కారు ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకుంటే 0.25 శాతం వడ్డీ తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు. ఇది కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట కలిగించే ఆఫర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఇక ఎస్బిఐ యోనో యాప్ నుంచి ఎంతో సులభ రీతిలో లోన్ పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోవడం వల్ల వడ్డీ రేట్ లో కూడా డిస్కౌంట్ పొందేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: