చాలా రోజుల‌కు ఒక స‌క్సెస్
బీజేపీకి
చాలా రోజుల‌కు ఒక ఝ‌ల‌క్
వైసీపీకి
సొంత ఇలాకా త‌న మాట నెగ్గించుకోలేక‌
జ‌గ‌న్

 
టిప్పు అంటే మండిప‌డ‌డం త‌ప్ప
తాము సాధించేది ఏమీ లేద‌ని తెలిసినా
త‌మ ప‌ట్టు నిలుపుకున్న బీజేపీ
ఇదీ ఇవాళ్టి పొలిటిక‌ల్ గేమ్


 
టిప్పు విగ్ర‌హం కోసం
భూమి పూజ వైసీపీ చేస్తే
దానిని అడ్డుకుని క్రెడిట్ మొత్తం
బీజేపీ త‌న జేబులో వేసుకుంది
ఫాఫం క‌దూ!


సీఎం జ‌గ‌న్ కు షాక్ ...బీజేపీ రాక్..ఇలాంటివి చెప్ప‌ను కానీ ఇప్పుడు జ‌రిగింది మాత్రం కాస్త విస్మ‌య‌కార‌కం.ఎప్ప‌టి నుంచో బీజేపీ త‌న గొంతుక‌ను వినిపిస్తూ,జ‌గ‌న్ ను విసిగిస్తూ వ‌స్తుంది.పాపం ఆయ‌నేమో ప‌ట్టించుకోడా యె!కానీ ఎట్ట‌కేల‌కు ఆంధ్రావ‌ని లో బీజేపీ కాల‌రెగ‌రేసుకునేలా ఒక విజ‌యం న‌మోద‌వ్వడం వీర్రాజు అనే బీజేపీ లీడ‌ర్ కు పండుగంటే పండుగే! వాస్త‌వానికి రెడ్డి ఫ్యాక్ట‌ర్ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంలో కాపు నేత‌లంతా చేర‌డం ఓ విధంగా కొత్త ఉత్సాహ‌మే..ఉత్పాతం అయితే కాదు.

రాజ‌కీయంలో వ‌చ్చే మార్పుల‌కు పార్టీలు బాధ్య‌త వ‌హిస్తాయా?కొన్ని సార్లు త‌మ మాటే మంత్రం అయ్యేందుకు ప‌రిత‌పిస్తాయి కానీ అన్ని వేళ‌లా కుద‌ర‌దు.తాజాగా ఓ ప‌రిణామం ముఖ్యమంత్రి మ‌నుషుల్లో కొత్త క‌ల‌వ‌రం తీ సుకువ‌చ్చింది.ఆయ‌న సొంత జిల్లాలోనే కొత్త క‌ల‌హాలు వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ తేల్చేశారు.ఇందుకు స‌ర్వోన్న‌త న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును ఉద‌హ‌రిస్తూ,అన‌వ‌స‌ర గొడ‌వ‌లు వ‌ద్ద‌ని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చి,ఎమ్మెల్యేను త‌గ్గేలా చే శారు.ఎప్ప‌టినుంచో టిప్పుకు వ్య‌తిరేకంగా అక్క‌డెక్క‌డో క‌ర్ణాట‌క‌లో బీజేపీ చేసే పోరు, ఈ సారి ఏపీకి షిఫ్ట్ అయింది.ఆయ‌న హిందూ మ‌త ద్వేషి అని, ఆయ‌న విగ్ర‌హ ఏర్పాటుతో మా మ‌నో భావాలు దెబ్బ‌తింటాయ‌ని బీజేపీ వీ ర్రాజు మండిప‌డుతూ పెద్ద  ఎత్తున కార్యక‌ర్త‌ల‌తో పులివెందుల చేరుకుని నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ సైతం రూల్స్ పేరిట ఎమ్మెల్యేను అడ్డుకుని కొంత వివాదాన్ని చ‌ల్లార్చేరు.


టిప్పు సుల్తాన్ విగ్ర‌హ ఏర్పాటును అడ్డుకోవ‌డం అన్న‌ది బీజేపీకి క‌లిసొచ్చే అంశం.దీంతో వారు హీరోలు కావొచ్చు.స్థానికంగా త మ ప‌ట్టు లేదా ఉనికి నిరూపించుకోవ‌చ్చు.అచ్చం ఇలానే క‌డ‌ప‌లో ముఖ్య‌మంత్రి ఇలాకాలో జ‌ రిగింది.పులివెందుల ఎమ్మెల్యే శివ ప్ర‌సాద్ రెడ్డి ఏర్పాటు చేయాల‌నుకున్న టిప్పు విగ్ర‌హాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నెల‌కొల్పేందుకు వీల్లేంద‌ని క‌లెక్ట‌ర్ తేల్చేశారు. దీం తో బీజే పీ వ‌ర్గీయులు పండుగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: