అధికార వైసీపీలో బలమైన నాయకులు చాలామంది ఉన్నారు. వారి దెబ్బకు ప్రతిపక్షాలు కూడా భయపడుతుంటాయి. అలాగే ఆ నాయకుల నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులకు విజయం దక్కడం కూడా అంత సులువు కాదు. అలా ప్రత్యర్ధులకు విజయం దక్కకుండా చేస్తున్న నాయకుల్లో మంత్రి కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. మొన్నటివరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని కొడాలి, తన కంచుకోటగా మార్చేసుకున్నారు.

నాని వైసీపీలోకి వచ్చిన దగ్గర నుంచి, గుడివాడలో ఆయనకు టీడీపీ చెక్ పెట్టలేకపోతుంది. అభ్యర్ధులని మార్చిన కూడా వర్కౌట్ కావడం లేదు. అలా అభ్యర్ధులని మార్చి రెండుసార్లు ఫెయిల్ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా నానికి ఎదురులేదని విశ్లేషణలు వస్తున్నాయి. టీడీపీ తరుపున ఏ నాయకుడు నిలబడిన గుడివాడలో మాత్రం నానీని ఓడించడం చాలా కష్టమని తెలుస్తోంది.

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే గుడివాడలో మాత్రం టీడీపీ జెండా ఎగరడం కష్టమనే విధంగా పరిస్తితులు కనిపిస్తున్నాయి. మరి నానికి చెక్ పెట్టాలంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరోకరు గుడివాడ బరిలో దిగాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. టీడీపీని నానా ఇబ్బందులు పెడుతున్న నానికి చెక్ పెట్టాలంటే నందమూరి ఫ్యామిలీనే కరెక్ట్ అని అంటున్నారు. లేదంటే ఎన్టీఆర్‌ని నెక్స్ట్ ఎన్నికల ప్రచారంలోకి దించాలని, ఆయన చేత గుడివాడలో టీడీపీ తరుపున ప్రచారం చేయించాలని, అప్పుడే నానికి చెక్ పడుతుందని మాట్లాడుకుంటున్నారు.


కానీ పరిస్తితులు మాత్రం అలా లేవు. నందమూరి ఫ్యామిలీ నుంచి గుడివాడలో పోటీ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీగా లేరని తెలుస్తోంది. ఒకవేళ బాలయ్యని ఇక్కడకు తీసుకొచ్చిన ఫలితం ఉండదని అర్ధమవుతుంది. అటు ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి రావడం గానీ, ఎన్నికల ప్రచారం చేసే ఛాన్స్ గానీ లేదని తెలుస్తోంది. ఒకవేళ ప్రచారానికి వచ్చిన గుడివాడ మాత్రం రారని, కొడాలిని ఓడించడానికి ప్రచారం చేయడం చాలా కష్టమని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: