ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పొత్తుల పరంపర కొనసాగేలా కనిపిస్తోంది. పరిస్తితులకు అనుగుణంగా రాజకీయం చేసి పార్టీని బలోపేతం చేయాల్సిన పవన్...అదే పరిస్తితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుంటూ ముందుకెళుతున్నారు. జనసేన పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు దాటుతున్న కూడా, ఆ పార్టీ పరిస్తితి ఇప్పటికీ ఘోరంగానే ఉంది.

అయితే మొదట నుంచి పొత్తులతో ముందుకెళుతున్న పవన్, ఆ తర్వాత కూడా పొత్తులతోనే ముందుకెళ్లెలా కనిపిస్తున్నారు. అందుకే పార్టీని బలోపేతం చేస్తున్నట్లు కనిపించడం లేదు. 175 నియోజకవర్గాల్లోనూ జనసేనకు సరైన నాయకులు లేరు. ఒకవేళ నాయకులని పెడితే మళ్ళీ పొత్తు పెట్టుకుంటే అన్నీ సీట్లలో ఇబ్బందికర పరిస్తితులు వస్తాయి. మరి అందుకే అనుకుంటా పవన్, పార్టీని ఏ మాత్రం పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదని విశ్లేషణలు వస్తున్నాయి.

ఇప్పటికే పవన్ పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. 2014లో టీడీపీ-బీజేపీలతో, 2019 ఎన్నికల్లో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పిలతో కలిసి పొత్తు పెట్టుకుని ఘోరంగా విఫలమయ్యారు. ఎన్నికలయ్యాక పవన్ మళ్ళీ బీజేపీతో దోస్తీ మొదలుపెట్టారు. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో పవన్, సేఫ్ సైడ్‌గా అలా ముందుకెళుతున్నారు. మరి బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ సాధించింది ఏంటంటే? ఏం లేదని చెప్పొచ్చు. పైగా బీజేపీతో పొత్తు వల్ల జనసేన ఓట్లు ఇంకా తగ్గాయని తెలుస్తోంది.

ఇలాంటి పరిస్తితుల్లో పవన్ మరోసారి టీడీపీతో జత కట్టనున్నారని తెలుస్తోంది. టీడీపీతో కలిస్తే తమకు ప్లస్ అవుతుందని, అలాగే తమ వల్ల టీడీపీకి లాభం ఉంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం పవన్, చంద్రబాబుతో కలిసి జగన్‌ని ఎదురుకుంటారని ప్రచారం జరుగుతుంది. టీడీపీతో పొత్తు కోసమే పవన్ రాష్ట్రంలో జనసేనని బలోపేతం చేయడం లేదని, కానీ కొన్నిచోట్ల మాత్రం పార్టీని స్ట్రాంగ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పొత్తులో భాగంగా ఆ సీట్లని జనసేన తీసుకోవడానికి. మొత్తానికైతే పవన్ స్ట్రాటజీ ఇలా ఉంది. మరి నెక్స్ట్ పొత్తు ఫిక్స్ అవుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: