కాంగ్రెస్ పార్టీలో గొడ‌వ‌లు, త‌గాదాలు స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌య‌మే.. కానీ, తాజాగా కాంగ్రెస్‌లో ఏర్పడిన చిచ్చు కాస్త భిన్న‌మైన‌ద‌నే చెప్పాలి. నేత‌లే కాదు, పార్టీ మొత్తం డిఫెన్స్‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల టీఆర్ ఎస్ పార్టీ తీసుక‌వ‌చ్చిన ద‌ళిత‌బంధుపై కాంగ్రెస్ ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళిత‌బంధును అమలు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళిత గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ‌ దండోరా పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తోంది. అయితే, ద‌ళితబంధు విష‌యంలో మౌనంగా ఉంటే పార్టీకి దెబ్బ త‌ప్ప‌ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.


   ఇప్ప‌టికే  రైతుబంధు, రైతు భీమా ఇత‌ర ప‌థ‌కాల ద్వారా టీఆర్ఎస్ ఓటు బ్యాంకును పెంచుకుంది. ఈ క్ర‌మంలో మిగ‌తా వారిని త‌మవైపున‌కు తిప్పుకోవ‌డం కోసం వ్యూహాలు ర‌చిస్తోంది అందులో భాగంగానే ఎస్సీ సామాజిక వ‌ర్గాల ఓట్ట‌ను ఒడిసి ప‌ట్టుకోవ‌డం కోసం ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఒక్కో కుటుంబానికి 10 ల‌క్ష‌లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో కాంగ్రెస్ త‌ర్జ‌న‌బ‌ర్జ‌న ప‌డుతోంది.. ప్ర‌భుత్వం తీసుకున్న ద‌ళిత‌బంధు కాంగ్రెస్‌ను డైలమాలో ప‌డేస్తోంది. ద‌ళిత‌బంధు పై ఎటు తేల్చ‌లేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌లో భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.


    ఈ వాద‌న‌ల్లో సీఎల్పి భ‌ట్టి విక్ర‌మార్క ద‌ళిత‌బంధుకు అనుకూలంగా వ్య‌వ‌హరిస్తూ, దేశంలో ద‌ళితుల‌కు ఇలాంటి మంచి ప‌థ‌కం ఇంకోటి లేద‌ని వెల్ల‌డిస్తున్నాడు.  అయితే, గ‌తంలో సీఎం కేసీఆర్ ద‌ళితుల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర‌లేద‌ని విమ‌ర్శించాడు. సీఎల్పి నేత‌గా భ‌ట్టి తీసుకున్న నిర్ణ‌యంపై టీపీసీసీ చీఫ్‌గా బ‌య‌ట‌కు స్పందించ‌కున్న లోలోప‌ల అస‌హ‌నంతో ఉన్నాడ‌ని తెలుస్తోంది.



 అందుకే కేసీఆర్ ద‌ళిత‌బంధు స‌న్నాహ‌క స‌మీక్ష‌కు హాజ‌ర‌వుతాన‌ని భ‌ట్టి చెప్ప‌డంతో రేవంత్ కు ఇష్టం లేక‌పోయిన అంగీకరించార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అయితే, భ‌ట్టి నివాసంలో జ‌రిగిన బ్రేక్‌ఫాస్ట్ భేటీకి కాంగ్రెస్ పార్టీలోని కీల‌క నేత‌లంద‌రూ హ‌జ‌ర‌య్యారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో ద‌ళిత‌బంధు ప‌థ‌కం కాంగ్రెస్‌లో కుంప‌టి రేపుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: