తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన విషయంలో ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అత్యాచార ఘటనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యపరుస్తోంది. చాలా రాష్ట్రాల్లో సిబిఐ విచారణ వరకు వెళ్లడం తర్వాత ఉరి శిక్షలు విధించడం వంటివి జరుగుతుంటే తెలంగాణలో మాత్రం బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిశ ఘటన విషయంలో అలాగే తాజాగా జరిగిన చిన్నారి ఘటన విషయంలో ఇదే జరిగింది అనే అభిప్రాయం కొంతవరకు వ్యక్తమవుతోంది.

చిన్నారి ఘటనలో సీఎం కేసీఆర్ చాలా వేగంగా స్పందించండి కాకుండా పోలీసులు అందర్నీ కూడా అలెర్ట్ చేశారు. రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే సీఎం కేసీఆర్ మాత్రం ఎప్పటికప్పుడు హోంమంత్రి అలాగే డీజీపీలతో మాట్లాడుతూ ఎస్సీలకు కూడా కొన్ని సూచనలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా మరికొంత మంది పోలీసులతో స్వయంగా సీఎం కేసీఆర్ మాట్లాడి తీసుకునే చర్యలపై అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఘటన విషయములో నిందితుడు రాజు తప్పించుకోకుండా పోలీసులు దాదాపు వెయ్యిమంది మోహరించారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా నిందితుడు తప్పించుకోకుండా చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖ 10 లక్షల రివార్డు ప్రకటించడం ఆ తర్వాత పోలీసులు 70 బృందాలుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం వంటివి జరిగాయి. దీంతో నిందితుడు రాజు ఎక్కడికి వెళ్ళకుండా హైదరాబాద్ పరిసరాల్లోని ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. మీడియాకు ఇచ్చిన సమాచారం అలాగే సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కూడా నిందితుడు రాజును ఇబ్బంది పెట్టింది. దీంతో ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో నిందితుడు రాజు ఇబ్బంది పడ్డాడు. ఇది ఆత్మ హత్యకు ప్రధాన కారణమై ఉండవచ్చు అనే  వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr