విన్న‌పాలు వినే దేవుడి ద‌గ్గ‌ర
ఏమ‌యినా చెప్పాలి
ద‌రిద్ర‌గొట్టు జీవితాల‌ను సంస్క‌రించి
మ‌నుషుల‌ను ఆదుకోవాలి అని
చిన్నారి చైత్ర‌కు నివాళి ఇచ్చి
అన్యాయం చేసిన దేవుడితో విభేదం పెంచుకోవాలి!





దేవుడు అనే ప‌దం ద‌గ్గ‌ర ఆ బాల్యం ఓడిపోయింది. చిన్నారి చైత్ర‌కు దేవుడు అన్యాయం చేశాడు. బిడ్డ‌ను దూరం చేసి త‌ల్లీ తండ్రీ జీవిత కాలం విల‌పించేలా  చేశాడు. ఆ ఉప్పునీటి స‌ముద్రాల‌ను జీవితాంతం తోడు ఉంచుకోవాలి. దేవుడు సృష్టించిన తుఫానులో వాడు కొట్టుకుపోయాడు. లేదా వాడి ప్రాణం ఒక‌టి కొట్టుకుపోయింది. మ‌నుషుల నుంచి మార్పు కోరుకునేలా తుఫాను రావాలి. అప్పుడే దేవుడు ఉన్నాడ‌ని న‌మ్ముతాను. మెగాస్టార్ మాట‌ల‌ను న‌మ్ముతాను. లేదంటే చిరు స‌ర్ తో త‌గువు పెట్టుకుంటాను.



ఇవాళ నాలో ఏమీ లేదు 
మ‌న‌లో ఏమీ లేదు.
క‌న్నీళ్ల‌న్నీ ఇలా వృథా చేయ‌కండి.. బుజ్జి త‌ల్లుల క్షేమం కోసం ప‌నిచేయండి మీరంతా!వ‌రంగ‌ల్ ఘ‌ట్ కేస‌ర్ రైలు ప‌ట్టాపై శ‌వ‌మై తేలాడు రాజు. దీంతో పోలీసులు, మీడియా అంతా క‌థ ముగిసింద‌న్న భ్ర‌మ‌లో ఉన్నారు.
క‌థ ముగిసే వేళ కొన్ని క‌న్నీళ్ల‌కు విలువ ఏంట‌న్న‌ది తేలిపోవాలి. దేవుడు ఉన్నాడ‌ని మెగాస్టార్ అంటున్నారు. దేవుడు త‌న ప‌ని తాను చేసుకుపోయాడ‌ని ఆయ‌న అంత‌రార్థ భావ‌న‌. చిన్నారి చైత్ర విష‌య‌మై దేవుడు ఉన్నాడా లేడా అన్న‌ది ఇప్పుడు పెద్ద సంశ యం. ఆడుకునే వ‌య‌సు. పాడుకునే వ‌య‌సు. ఏమీ తెలియ‌ని వ‌య‌సు. బిడ్డ‌ల‌కు ఆనందాలు త‌ప్ప ఏమీ ఉండ‌ని వ‌య‌స్సు. ఆ బంగరు త‌ల్లికీ, నిందితుడికీ ఎటువంటి విభేదాలూ లేవు. హాయిగా ఆడుకునే బిడ్డ‌ల‌కు ఇత‌రుల‌తో ఏం విరోధం ఉంటుంది. మ‌రి! ఏ మీ లేకుండా చంపేశాడు. దేవుడు ! ఇలా చంప‌మ‌ని ఆదేశాలు ఇవ్వ‌డు కూడా! మంచివాడైన దేవుడు మంచే చేయాలి. మ‌రి! చే సిందంతా మంచేనా! బుజ్జి త‌ల్లీ మ‌మ్మ‌ల్ని క్ష‌మించు అని వేడుకోవ‌డం మిన‌హా ఇవాళ నాలో ఏమీ లేదు మ‌న‌లో ఏమీ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg